Asianet News TeluguAsianet News Telugu

“కల్కి” నార్త్ లో ట్రెండ్ ఎలా ఉంది, ఫస్ట్ డే ఎంత ఎక్సపెక్ట్ చేస్తున్నారు?

బాహుబలి  సినిమా నార్త్ లో కూడా సంచలన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ కు అక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Prabhas #Kalki2898AD  Hindi BO Details jsp
Author
First Published Jun 26, 2024, 4:53 PM IST


   “కల్కి 2898 ఎడి” విడుదలకు మరికొద్ది గంటలే ఉంది. ఈ నేపధ్యంలో ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ మేనియా షురూ అయింది. కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ సేల్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.50 కోట్లు దాటింది.  తెలుగు రాష్ట్రాల్లో చెప్పక్కర్లేదు. అసలు టిక్కెట్లు దొరకని పరిస్దితి.  ఇక నార్త్ ఇండియా పరిస్దితి ఏమిటి అంటే అక్కడ బుకింగ్స్‌ గ్రాండ్‌గా షురూ అవుతున్నాయి.  బుకింగ్స్ మొదలుపెట్టిన కొన్ని గంటలకే ఈ మూవీ నేషనల్‌ బెల్ట్‌లో హిందీ వెర్షన్ టిక్కెట్స్‌ సుమారు 13 వేలకుపైగా అమ్ముడయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి 45 వేల టిక్కెట్లు దాకా అమ్మారని తెలిస్తోంది. వారం మధ్యలో విడుదలవుతున్నప్పటికీ కల్కి 2898 ఏడీకు ఈ రేంజి క్రేజ్ నార్త్ లో ఉంటుందని ఎక్సపెక్ట్ చేయలేదు. 

బాహుబలి' సినిమా నార్త్ లో కూడా సంచలన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ కు అక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభాస్ నటించిన చిత్రాలు హిందీ బెల్ట్ లో టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. ఇప్పుడు 'కల్కి 2898 AD' సినిమాపై మొదటి నుంచీ ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా ఈసారి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీ లాంటి బాలీవుడ్ స్టార్స్ యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ని బట్టి చూస్తే, కల్కి మూవీ 2024లో హిందీలో అతిపెద్ద ఓపెనర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి.
 
దాంతో నార్త్ లో ఫస్ట్ డే 15 కోట్లు దాకా వసూలు అవుతాయని అంచనా వేస్తున్నారు. అమితాబ్, దీపిక అభిమానులు కన్నా ప్రభాస్ కు ఉన్న అభిమానులే ఈ సినిమాకు ప్లస్ అవుతారంటున్నారు. ఈ మధ్యకాలంలో హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం భారీ ఓపినింగ్ తెచ్చుతుంది. దాన్ని ఈ సినిమా దాటుతుందని లెక్కేస్తున్నారు. అయితే నార్త్ లో అసలు ప్రమోషన్స్  చేయలేనట్లే. కేవలం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు. కాబట్టి కంటెంట్ ఏ మాత్రం బాగున్నా సినిమా కలెక్షన్స్ నెక్ట్స్ లెవిల్ లో ఉంటాయంటున్నారు. 

ఇక శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నగ‌రంలో ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో క‌ల్కి టీమ్ ప్ర‌త్యేక ప‌ద‌ర్శ‌న చేసింది. సీనియర్ న‌టి శోభనతో పాటు పలువురు నృత్యకారిణులు యుమున న‌ది ఒడ్డున సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన గ్లింప్స్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఫుల్ వీడియోను త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios