Asianet News TeluguAsianet News Telugu

`కల్కీ` వచ్చేది ఆ డేట్‌ కే.. ఆ ఇండస్ట్రీ హిట్‌ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేయడానికే?

ప్రభాస్‌ నెక్ట్స్ `కల్కీ` సినిమాతో రాబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి సస్పెన్స్ నెలకొంది. అయితే తమ సెంటిమెంట్‌ డేట్‌కి ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. 

prabhas kalki movie release date update for repeat hit sentiment ? arj
Author
First Published Jan 9, 2024, 12:24 PM IST

ప్రభాస్‌ ఇటీవల `సలార్‌` తో దుమ్ములేపాడు. `డంకీ`వంటి గట్టి పోటీ మధ్య ఈ మూవీ ఏడు వందల కోట్లకు చేరువ అయ్యింది. ఇంకా రన్నింగ్‌లో ఉంది. ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌, ప్రభాస్‌ కటౌట్‌, బీజీఎం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. దీంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. తాజాగా చిత్ర బృందం సక్సెస్‌ సెలబ్రేషన్‌ కూడా చేసుకున్నారు. `సలార్‌` బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌ పేరుతో పార్టీ చేసుకున్నారు. 

ఇదిలాఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మరో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఉంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌తో గ్లోబల్‌ రేంజ్‌లో `కల్కీ2898ఏడీ` సినిమా ఉంది. ఇది భారీ కాస్టింగ్‌తో, భారీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో రూపొందుతుంది. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. 

నిజానికి ఈ సినిమాని సంక్రాంతికే రిలీజ్‌ చేయాల్సింది. గతంలో రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. కానీ షూట్‌ వర్క్ కంప్లీట్‌ కాలేదు. సీజీవర్క్ చాలా ఉంది.దీంతో సినిమాని వాయిదా వేసుకున్నారు. అయితే ఇంకా కొత్త  రిలీజ్‌ డేట్‌ని ప్రకటించలేదు. సినిమా పోస్ట్‌ పోన్‌పై కూడా వాళ్లు రియాక్ట్ కాలేదు. సంక్రాంతి సందర్భంగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించబోతున్నారు.

ఇదిలా ఉంటే `కల్కీ` రిలీజ్‌కి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌ డేట్‌ వినిపిస్తుంది. సినిమాని తమ హిట్‌ సెంటిమెంట్‌ డేట్‌కే విడుదల చేయాలని భావిస్తున్నారట నిర్మాత అశ్వినీదత్‌. వైజయంతి బ్యానర్‌లో వచ్చిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ మే 9న విడుదలైంది. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పటికీ ఓ క్లాసిక్‌లా నిలిచింది. ఆ తర్వాత అదే డేట్‌కి `మహానటి` చిత్రాన్ని రూపొందించారు. సావిత్రి జీవితంపై వచ్చిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరో క్లాసిక్‌ లా నిలిచింది.

దీంతో ఇప్పుడు అదే హిట్‌ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట. మే 9న తమ ప్రతిష్టాత్మక మూవీ `కల్కీ`ని విడుదల చేయాలని భావిస్తున్నారట. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్‌ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇక సైన్స్ ఫిక్షన్‌ భవిష్యత్‌ కాలాన్ని ఆవిష్కరించేలా ఈమూవీ సాగుతుందని, భూమిని ఆక్రమించుకునేందుకు ఇతర గ్రహాంతర వాసులు దారుణాలకు తెగబడటం, దాన్ని మానవ జాతి ఎదుర్కోవడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీసాగుతుందని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్‌ ఓ వీరుడుగా కనిపించబోతున్నారు. ఆయన సైన్యంగా అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటివారు నటిస్తున్నారు. గ్రహాంతర వాసుల నాయకుడిగా నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios