పెంచుకుంటూ పోతే పెరిగేది బడ్జెట్టే కానీ బిజినెస్ కాదు అని ప్రభాస్ తన స్నేహితులైన నిర్మాతలు యువి క్రియోషన్స్ వారిని హెచ్చరిస్తున్నారట. అయినా వాళ్లు బాహుబలి తర్వాత వస్తున్న  ‘సాహో’ చిత్రంకి ఆ మాత్రం క్రేజ్ ఉంటుందని షెడ్యూల్ ..షెడ్యూల్ కు బడ్జెట్ ని పెంచేసి నీళ్లులా డబ్బు పోస్తున్నారని టాక్.

అయితే ఇలా బడ్జెట్ పెరిగిపోతే ఆ సినిమా మెగా హిట్ అయితే కానీ రికవరీ అవదని, లాభాల్లో పడాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని ప్రభాస్ చెప్తున్నారని తెలుస్తోంది. అలాగే సినిమా ఏ మాత్రం అంచనాలకు దగ్గరగా లేకపోయినా ఫ్యాన్స్ నిరాశపడతారని, అప్పుడు అది కలెక్షన్స్ పై చూపెడుతుందని తనపై మోయలేని భారం పెట్టవద్దని కోరుతున్నాడట.

అందుకు కారణం ఇప్పటికే 250 కోట్లు దాకా ఈ సినిమాపై పెట్టుబడి పెట్టారట. ఇంకో యాభై కోట్లు దాకా అయ్యేటట్లు ఉందని అంచనా వేస్తున్నారట. గత కొద్ది వారాలుగా ఈ బడ్జెట్ మరీ పెరిగిపోయిందిట. దర్శకుడు, నిర్మాత ఓవర్ కాన్ఫిడెన్స్ తో డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. దగ్గర నుంచి గమనిస్తున్న ప్రభాస్ ఈ విషయమై హెచ్చరికలు జారీ చేస్తున్నా..వారు లైట్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

ఇక ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్  ఇప్పటికే ప్రకటించింది. ఆ రోజునే రిలీజ్ కు ఎంచుకోవటానికి కారణం..ఆ రోజు దేశం మొత్తం శెలవు రోజు అనేది ఓ కారణం అయితే సినిమాలో దేశభక్తికి సంభందించిన కొన్ని ఎలిమెంట్స్ మిళితం కావటం వల్ల కూడా ఆ రోజుని ఫిక్స్ చేసారని తెలుస్తోంది. 

ఇందులో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌  హీరోయిన్ గా నటిస్తున్నారు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌- లాయ్ త్రయం, తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, ఎవ్లిన్‌ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.