మసాలా చిత్రాలు కోరుకునే అభిమానులకు ధూమ్ సిరీస్ పండగే. బైక్ చేజింగ్స్, కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, మతి పోగొట్టే అందాలతో ఆకట్టుకునే హీరోయిన్లు ఇలా ధూమ్ సిరీస్ మొత్తం ఇప్పటివరకు సినీ ప్రేక్షకులని అలరించింది. మొదటి భాగంలో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించాడు. ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ధూమ్ 4కి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ధూమ్ 4 లో నటించేందుకు సల్మాన్ ఖాన్, షారుఖ్, రణబీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్లు నో చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ఆ అవకాశం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వద్దకు వచ్చిందట. ధూమ్ 4 నిర్మాతలు ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ధూమ్ సిరీస్ మొత్తం పోలీసలు, దొంగ మధ్యలో జరిగే కథ. అభిషేక్ బచ్చన్ పోలీస్ అధికారిగా నటించాడు. హృతిక్, జాన్ అబ్రహం, అమిర్ ఖాన్ దొంగలుగా నటించారు. ధూమ్ 4లో హీరో పాత్ర ఇంకాస్త ఘాటుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాను అనుకున్న పనిచేసేందుకు క్రూరంగా ప్రవర్తించే వ్యక్తిలా హీరో పాత్ర ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా తుపాకులు, చేజింగ్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ధూమ్ 4పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. ధూమ్, ధూమ్ 4 చిత్రాలని తెరకెక్కించిన విజయ్ కృష్ణ ఆచార్య ధూమ్ 4ని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధూమ్ 4పై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ధూమ్ సిరీస్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.