#Prabhas:హాస్పిటల్‌లో ప్రభాస్ (వీడియో)..కారణం అదేనా?
. తాజాగా ప్రభాస్ హాస్పటిల్ లో కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వీడియో గురించిన సరైన ఇన్పర్మేషన్ ఎవరి వద్దా లేదు. కానీ ఆ వీడియో గురించి హాట్ టాపిక్ గా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్ కు చెందిన ప్రతీ విషయం నెట్టింట ట్రెండ్ అవుతూంటుంది. ఆయన సినిమాల గురించే కాదు..వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తూంటారు. సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తూంటారు. తాజాగా ఆయన హాస్పటిల్ లో కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వీడియో గురించిన సరైన ఇన్పర్మేషన్ ఎవరి వద్దా లేదు. కానీ ఆ వీడియో గురించి హాట్ టాపిక్ గా మారింది.
ఏ హాస్పటిల్ లోనో తెలియదు కానీ ఇలా ఓ హాస్పిటల్‌లో ప్రభాస్ అలా నడిచి వస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. అది కొందరు పాత వీడియో అని అంటే.. అదేం కాదు అది కొత్త వీడియోనే అని ఇంకొందరు అంటున్నారు. ప్రభాస్‌కు ఏమైందని కొందరు అంటూ కామెంట్స్ చేస్తూంటే.. కృష్ణంరాజును చూసేందుకు హాస్పటిల్‌కు వెళ్లాడని ఇంకొందరు అభిమానులు అంటున్నారు. ఏది నిజమనేది తెలియాల్సి ఉంది.
మరో ప్రక్క ఈ వీడియోను చూసిన అభిమానులు ‘ప్రభాస్‌కు ఏమైంది?’ అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ‘బాహుబలి’ (Bahubali) సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కాలికి గాయమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ గాయం నిమిత్తం యూరప్‌లో సర్జరీ కూడా చేయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడదే గాయం మళ్లీ ఆయనని ఇబ్బంది పెడుతుందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ప్రభాస్‌ని వైద్యులు పరీక్షించి దాదాపు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలనేలా సూచనలు ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి ప్రభాస్ ఇలా హాస్పిటల్‌లో దర్శనమివ్వడంతో.. మళ్లీ ఏమైందా? అని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.
ఇక : 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్. ఇప్పుడు తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ చిత్రాలను తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇంగ్లీషుతో పాటు పలు ఇతర ఫారిన్ భాషల్లో కూడా ప్రభాస్ సినిమాల విడదుదలకు ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి ఆదిపురుష్.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో అన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కతున్నవే. ఇక ఈ హీరో మొదటిసారి బాలీవుడ్ దర్శకుడు అయిన ఓం రౌత్‌తో చేయి కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే 'ఆదిపురుష్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకుంది. ఇంతలోనే ఈ మూవీలో ఓ బాలీవుడ్ హీరో కూడా భాగమవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది.