ప్రభాస్‌ హోం బ్యానర్‌ యూవీ క్రియేషన్స్  భారీ సినిమాలనే కాదు, డిఫరెంట్స్ స్టోరీస్‌ని, కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించబోతుంది. భారీ బడ్జెట్‌ చిత్రాలకు పారలల్‌గా చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంది. కంటెంట్‌ ఉన్న డైరెక్టర్లు, ఆర్టిస్టులకు లైఫ్‌ ఇచ్చే ప్రోగ్రామ్‌ చేపట్టింది. అందుకోసం యూనీ కాన్సెప్ట్స్ పేరుతో ఓ బ్యానర్‌ని స్థాపించింది. ఇందులో `ఏక్‌ మినీ కథ` పేరుతో ఓ సినిమాని రూపొందిస్తుంది. `డోస్‌ సైజ్‌ మ్యాటర్‌` అనేది మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. `పేపర్‌బాయ్‌`తో ఆకట్టుకున్న సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తుండటం విశేషం. 

ఈ సినిమాకి `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌`, `ఎక్స్ ప్రెస్‌ రాజా` వంటి సినిమాలను రూపొందించిన మేర్లపాక గాంధీ కథ అందించడం మరో విశేషం. కార్తీక్‌ రాపోలు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇందులోని ఓ పాటని విడుదల చేశారు. `ఈ మాయలో..`అంటే సాగే పాటని విడుదల చేయగా అది శ్రోతలను మెప్పిస్తుంది. ఆకర్షిస్తుంది. ప్రవీణ్‌ లక్కరాజు సాహిత్యంతోపాటు సంగీతం అందించారు.  రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదలకు సిద్ధమవుతుంది.