Asianet News TeluguAsianet News Telugu

మ్యారేజ్‌ జర్నీపై ప్రభాస్‌ హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్.. రీచా గంగోపాధ్యాయ వీడియో వైరల్‌..

రీచా గంగోపాధ్యాయ  తాజాగా తన పెళ్లిపై ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. తన మ్యారేజ్‌ జరిగి నాలుగేళ్ల పూర్తయిన నేపథ్యంలో ఇటీవల ఆమె తన నాల్గవ మ్యారేజ్‌ యానివర్సరీ జరుపుకుంది.  

prabhas heroine richa gangopadhyay emotional post on her marriage video viral arj
Author
First Published Sep 17, 2023, 8:25 PM IST

`లీడర్‌` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రీచా గంగోపాధ్యాయ.. పదేళ్ల క్రితమే సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆమె పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా తన పెళ్లిపై ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. తన మ్యారేజ్‌ జరిగి నాలుగేళ్ల పూర్తయిన నేపథ్యంలో ఇటీవల ఆమె తన నాల్గవ మ్యారేజ్‌ యానివర్సరీ జరుపుకుంది. ఇందులో ఆమె ఓ వీడియో షేర్‌ చేసుకుంటూ పోస్ట్ పెట్టింది. 

ఈ పోస్ట్ లో రీచా గంగోపాధ్యాయ చెబుతూ, నాలుగేళ్ల క్రితం నేను చాలా అద్భుతమైన వ్యక్తితో ఓకే నేను చేస్తున్నా అని చెప్పాను. మేం విభిన్న ప్రపంచాల నుంచి వచ్చాం. కానీ మా ప్రత్యేకమైన మార్గాలు ప్రేమ, పరస్పర గౌరవం, కలలను పంచుకునే అందమైన ప్రయాణంలో సంపూర్ణంగా కలుస్తున్నాం. మేం ఈ గత నాలుగేళ్లలో నిజంగా ప్రత్యేకమైన దాన్ని నిర్మించాం. భవిష్యత్‌లో ఎలా ఉంటుందో చూడ్డానికి ఆతృతగా ఉన్నాను. మీతో జీవితాన్ని గడపడానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు` అంటూ తన భర్త జోయిని ట్యాగ్‌ చేసింది రీచా. దీంతో ఫ్యాన్స్ స్పందిస్తూ ఆమెకి మ్యారేజ్‌ యానివర్సరీ విషెస్‌ తెలియజేశారు.

ప్రభాస్‌తో `మిర్చి` చిత్రంలో నటించి పాపులర్‌ అయ్యింది రీచా గంగోపాధ్యాయ. అంతకు ముందు `లీడర్‌` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. కాలేజ్‌ చేసే రోజుల్లోనే సినిమా అవకాశం దక్కించుకుని నటిగా బిజీ అయ్యింది. `లీడర్‌`లో రానాతో కలిసి నటించి మెప్పించింది. మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వరుసగా ఆఫర్లని సొంతం చేసుకుంది. 

వెంకటేష్‌ నటించిన `నాగవళ్లి`లో కీలక పాత్రలో మెరిసింది. మాస్‌ మహారాజా రవితేజతో `మిరపకాయ్‌` చిత్రంలో ఓ హీరోయిన్‌గా మెరిసింది. తనదైన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత తమిళంలోకి, బెంగాలీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ వర్కౌట్‌ కాలేదు. దీంతో మళ్లీ తెలుగుకే షిఫ్ట్ అయ్యింది. మరోసారి రవితేజతో కలిసి `సారోచ్చారు` చిత్రంలో నటించింది. 

ఇక ప్రభాస్‌తో `మిర్చి` చిత్రంలో ఓ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. `భాయ్‌`లో నాగార్జునకి జోడీ కట్టింది. అయితే ఈ బ్యూటీకి `లీడర్‌`, `మిర్చి`నే విజయాలు అందించాయి. మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. కానీ హీరోయిన్‌గా బిజీ అవుతున్న సమయంలోనే టాలీవుడ్‌కి, తన అభిమానులకు షాకిచ్చిందీ బ్యూటీ. సినిమాల నుంచి తప్పుకుంది.స్టడీస్‌ కోసం సినిమాలు మానేసింది. జాబ్‌, పెళ్లి చేసుకుని లైఫ్‌ లో సెటిల్ అయ్యింది. మళ్లీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూడలేదు. 

అప్పుడప్పుడు తన సినిమాల రిలీజ్‌ టైమ్‌లో స్పందిస్తూ ఎమోషనల్‌ పోస్టులు పెడుతుంది.ఆ మెమోరీస్‌ని గుర్తు చేసుకుంటుంది. ఇక అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన రీచా గంగోపాధ్యాయ.. ఆ రత్వాత పెళ్లి చేసుకుంది. తన క్లాస్‌ మేట్‌ జోయి లాంగేల్లాని వివాహం చేసుకుంది. అమెరికాలో సెటిల్‌ అయ్యింది. వీరికి రెండేళ్ల క్రితం కుమారుడు జన్మించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios