Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ జంటగా ప్రభాస్ హీరోయిన్.. క్రేజీ న్యూస్ లో నిజం ఎంత..?

మెగాస్టార్ చిరంజీవి జోడీగా ప్రభాస్ హీరోయిన్. వింటానికి విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నన్యూస్ ఇదే. ఇంతకీఎవారా హీరోయిన్..? ఈక్రేజీ న్యూస్ లో నిజం ఎంత..? 
 

Prabhas Heroine Deepika Padukone Movie With Megastar Chiranjeevi JMS
Author
First Published Jan 12, 2024, 8:39 AM IST

ఈమధ్య కాంబినేషన్లు షాక్ ఇస్తున్నాయి. ఎప్పుడు ఎవరు.. ఎవరితో కలిసి సినిమా చేస్తారో చెప్పడం కష్టంగా మారింది. అంతే కాదు కొన్ని కాంబోలు సడెన్ గా సెట్ అయ్యి షాక్ ఇస్తుంటే..మరికొన్నికాంబినేషన్లు మాత్రం రూమర్లు గానే మిగిలిపోతున్నాయి.  మరికొన్ని మాత్రం రూమర్లుగా స్టార్ట్ అయ్యి..చివరకు నిజం అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కాంబో.. రూమర్ అవుతందా..? లేక నిజం అవుతుందా తెలియదు కాని.. ప్రస్తుతానికి మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడ్డ మెగాస్టార్ చిరంజీవి.. సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యతను యంగ్ డైరెక్టర్ పై పెట్టాడు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. డెబ్యూ మూవీతోనే గోల్డెన్ ఛాన్స్అందుకున్నాడు  దర్శకుడు వశిష్ట. ప్రస్తుతం చిరంజీవితో భారీ ప్యాన్ ఇండియా మూవీని లైన్ చేశాడు. ఈసినిమాకు విశ్వంభర టైటిల్ దాదాపు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  షూటింగ్ స్టార్ట్అయ్యింది. కాని ఇంకా మెగాస్టార్  సెట్స్ లో  అడుగుపెట్టలేదు. అయినా తన పనితాను చేసుకుంటూ వెళ్తున్నాడు వశిష్ట. ఇతర ఆర్టిస్ట్ లతో చేయవల్సిన సీన్లు చేసుకుంటూ వెళ్తున్నాడట. టైమ్ వేస్ట్ అవ్వకుండా. 

అయితే ఇక్కడ అసలు విషయం.. చాలా కాలంగా నానుతున్న విషయం ఏంటంటే.. ఈసినిమాలో హీరోయిన్ ఎవరు..? చాలా రోజులుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. ఎవరిపేరు అనౌన్స్ చేయలేదు. అసలేసీనియర్ హీరోలకు హీరోయిన్లు కొరత ఉంది. ఉన్న నాలుగురినే.. తిప్పి తిప్పి మార్చుకుంటున్నారు. మరి చిరు కోసం వశిష్ట ఎవరిని ప్లాన్ చేస్తున్నాడు అన్నదే విషయం.  హీరోయిన్లుగా త్రిష, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Prabhas Heroine Deepika Padukone Movie With Megastar Chiranjeevi JMS

ఈలోపు మెగా ఫ్యాన్స్ కోసం ఈ సంక్రాంతికి ఏదైనా  ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నారు టీమ్. కనీసం పోస్టర్ అయినా ఇస్తే.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతారు. లేదా హీరోయిన్ అనౌన్స్ మెంట్ చేసి పోస్టర్ వదిలితే.. ఇక తిరుగు ఉండదని భావిస్తున్నారట టీమ్. దాంతో ఈ విషయంలో అభిమానులు ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. మూవీ టీమ్ కూడా అంతే కష్టపడుతూ..పనిచేస్తున్నారు. 

ఇక ఈసినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ బయటకువస్తూనే ఉంది. అందులో నిజం ఎంత.. అబద్దం ఎంత తెలియదు కాని.. తాజాగా మరో అప్ డేట్ ఈమూవీ నుంచి బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  విశ్వంభరలో  ఓ సాంగ్ కోసం దీపికా పదుకునేని సంప్రదించారట. కథలో భాగంగా దొరబాబు పాత్ర చేయబోతున్న చిరంజీవి ఓ దేవకన్యని కలుస్తాడట. ఆ సందర్భంగా వచ్చే చిన్న ఎపిసోడ్లో స్పెషల్ సాంగ్ ఉంటుందట. 

అచ్చం జగదేక వీరుడు అతిలోక సుందరి మాదిరిగా ఈసీన్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు అదరిపోయే  సెట్లు, కళ్లు చెదిరే లొకేషన్ లో..జిగేలుమనిపించే  కాస్ట్యూమ్స్ తో ఈ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.  ఇక  చిరు డాన్స్ చేసే పాట కోసం దీపికా పదుకునేను  అడిగినట్టు తెలిసింది. రెమ్యునరేషన్ ఎంతైనా పర్వాలేదనే రీతిలో యువి క్రియేషన్స్ సిద్ధంగా ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం దీపికా పదుకునే ప్రభాస్ సరసన కల్కి ఏడి 2898లో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios