సినిమా ఇండస్ట్రీలో కథానాయకుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు చాలానే ఉన్నాయి. కెరీర్ మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ - గోపీచంద్ పేర్లు ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రభాస్ రాజు గారు ఎంత మందితో ఉన్నా తన క్రేజ్ లో ఎంత పెరిగినా నా బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ అంటూ చెబుతుంటారు. 

ఇకపోతే వర్షం అనంతరం మళ్ళీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బావుంటుందని అభిమానులు గట్టిగానే కోరుకున్నారు. ఆ ఇద్దరు కూడా అందుకు సిద్ధమయ్యారు,. ఆ మధ్యలో ఇద్దరు మల్టీస్టారర్ కథలో నటిస్తున్నట్లు కథనాలు బాగానే వచ్చాయి. కొన్ని ఇంటర్వ్యూలలో గోపి కూడా ఈ విషయంపై స్పందించాడు. మంచి కథ దొరికితే ఇద్దరం చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. 

చాలా వరకు కథలు వచ్చాయి కానీ గోపికి నచ్చినా కూడా ప్రభాస్ ఇంకా ఎదో కావాలని అనుకుంటున్నాడట. అసలే ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. నేషనల్ వైడ్ కథలకే మొగ్గు చూపుతున్నాడు. కాబట్టి ఆయన కోరికతో తప్పులేదు. ఇక మరోవైపు గోపి ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా పెంచుకోలేకపోతున్నాడు. మెయిన్ గా ఇప్పుడు సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. గత కొంత కాలంగా చేస్తోన్న సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. 

ఈ సమయంలో ప్రభాస్ నుంచి స్నేహితుడికి కొంచెం హెల్ప్ వస్తే బావుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో జిల్ కథను విన్నప్పుడు ప్రభాస్ గోపికి ఆ కథను సజెస్ట్ చేసి హోమ్ బ్యానర్ యూవీ లోనే తెరకెక్కేలా చేశాడు. మరి ఇప్పుడు గోపి కోసం ప్రభాస్ కథను సజెస్ట్ చేస్తాడా? లేక మల్టీస్టారర్ మ్యాటర్ గురించి ఆలోచిస్తాడా? అనేది చూడాలి.