ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి వీడియో వైరల్.. 22 ఏళ్ళు గడిచింది, ఇప్పటికీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ చిత్రం గుర్తుందిగా. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం అదే. 2002లో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ నూనూగు మీసాల కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ చిత్రం గుర్తుందిగా. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం అదే. 2002లో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ నూనూగు మీసాల కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రం విడుదలై 22 ఏళ్ళు గడుస్తోంది. కానీ శ్రీదేవి ఇప్పటికీ అంతే క్యూట్ గా ఆకట్టుకుంటోంది. ఆమె ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. వివాహం తర్వాత శ్రీదేవి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. భర్త పిల్లలతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది.
అయితే శ్రీదేవి రీసెంట్ గా ఓ టీవీ షోలో సందడి చేసింది. ఆ షోలో శ్రీదేవి ఎంతో అందంగా ట్రెడిషనల్ లుక్ లో మైమరపించేసింది. ఆమె హావ భావాలు క్యూట్ నెస్ చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.
దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమె దృశ్యాలని వైరల్ చేస్తున్నారు. మరికొందరు ప్రభాస్ విజువల్స్ తో మ్యాచ్ చేస్తూ వీడియో ఎడిట్స్ పోస్ట్ చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తున్న వారంతా కుదిరితే ప్రభాస్, శ్రీదేవి మరో చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు. కనీసం శ్రీదేవి.. ప్రభాస్ మూవీలో చిన్న పాత్రలో అయినా కనిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వారి కోరిక ఫలిస్తుందో లేదో చూడాలి.