Radhe Shyam: రాధే శ్యామ్ థియేటర్ వద్ద ప్రమాదం.. విద్యుత్ షాక్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి తీవ్ర గాయాలు

కారంపూడిలో రాధే శ్యామ్ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ వద్ద అభిమానులు విద్యుత్ షాక్ తో గాయాల పాలయ్యారు. 
 

Prabhas fans injured at radhe shyam theatre with current shock

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ తెల్లవారు జాము నుంచి థియేటర్స్ లో సందడి షురూ చేసింది. ఈ చిత్రం క్లాస్ గా, ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది అంటూ ప్రీమియర్ షోల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా అభిమానులు చెప్పుకుంటున్నారు. 

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దీనితో ప్రభాస్ నటిస్తున్న  ప్రతి చిత్రంపై ఊహించని ఏర్పడుతున్నాయి. రాధే శ్యామ్ కూడా భారీ అంచనాలతో విడుదలవుతోంది. రిలీజ్ కి కొన్ని రోజుల ముందు నుంచే అభిమానులు థియేటర్స్ వద్ద ఫ్లెక్సీలు, కటౌట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 

కారంపూడిలో గురువారం రాత్రి ఓ థియేటర్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభాస్ అభిమాని ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. 37 ఏళ్ల కోటేశ్వరరావు అనే వ్యక్తి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలపై పడడంతో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరికొందరు ప్రభాస్ అభిమానులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు అత్యుత్సాహంతో ఇలా ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా ప్రభాస్ చాలా కాలం తర్వాత ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విధికి ప్రేమకి మధ్య జరిగిన యుద్ధంలో ప్రభాస్ తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios