కెజిఎఫ్ చాప్టర్ 2 బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ ని యష్ ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 హిట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ కావడానికి రీజన్ ఉంది.  

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస ప్లాప్స్ లో ఇబ్బంది పడుతున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన విడుదల చేసిన రెండు చిత్రాలు విఫలమయ్యాయి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో కొంత మేర పర్లేదు. తెలుగులో మోస్తరు నష్టాలు మిగిల్చిన ఆ చిత్రం హిందీలో మాత్రం సూపర్ హిట్ కొట్టింది. రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది. అయితే రాధే శ్యామ్ మాత్రం భారీ షాక్ ఇచ్చింది. ప్రభాస్ కెరీర్ లో అట్టర్ ప్లాప్ గా నిలిచిపోయింది. 

టాలీవుడ్ ఆల్ టైం నష్టాలు తెచ్చిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆకట్టుకొని సంగీతం, కనెక్ట్ కాని ఎమోషన్స్ తో పాటు ప్రభాస్ ఇమేజ్ కి సెట్ కానీ కథ ఆడియన్స్ కి అనుభూతి పంచడంలో విఫలమైంది. మొత్తంగా రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్ లో చెత్త మూవీగా మిగిలిపోయింది. బాహుబలితో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రభాస్ ఇలా డీలా పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

అయితే సలార్ (Salaar) మూవీ ప్రభాస్ కి గ్రేట్ కం బ్యాక్ ఇస్తుందని వారు నమ్ముతున్నారు. వారి నమ్మకం కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter2) విజయంతో మరింత బలపడింది. దీంతో కెజిఎఫ్ 2 విజయాన్ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కెజిఎఫ్ మొదటి భాగానికి మించి చాప్టర్ 2 ఉందన్న మాట వినిపిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కెజిఎఫ్ చాప్టర్ 2 రూపంలో మరో ఇండియా వైడ్ ఇండస్ట్రీ హిట్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. 

కెజిఎఫ్ సిరీస్లో హీరో యష్ (Yash) కి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఉహల్లో తేలుతున్నారు. ప్రభాస్ లాంటి భారీ కట్ అవుట్ కి ఆయన ఇచ్చే ఎలివేషన్స్ మరో లెవెల్ లో ఉంటాయని భావిస్తున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 ఎలా ఉంటుందోనన్న భయం చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని వెంటాడింది. నేటితో వాళ్ళ చింత తీరిపోయింది. సలార్ మూవీతో ప్రభాస్ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.