ఈ రోజుల్లో క్రియేటివిటికు హద్దులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో సరదాలుతో పోలీస్ లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. రీసెంట్ గా నితిన్  ట్వీట్ కు పోలీస్ లు రిప్లై ఇచ్చారు. వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దూకి ..తమ హీరో దర్శకుడు రాధకృష్ణ కుమార్ ని వెతికి పెట్టమని కంప్లైంట్ చేసారు.అయితే ఇదంతా ఫన్ లో భాగంగానే జరిగింది.

ఈ రోజుల్లో క్రియేటివిటికు హద్దులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో సరదాలుతో పోలీస్ లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. రీసెంట్ గా నితిన్ ట్వీట్ కు పోలీస్ లు రిప్లై ఇచ్చారు. వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దూకి ..తమ హీరో దర్శకుడు రాధకృష్ణ కుమార్ ని వెతికి పెట్టమని కంప్లైంట్ చేసారు.అయితే ఇదంతా ఫన్ లో భాగంగానే జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా ‘రంగ్‌ దే!’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్‌ ఒక ట్వీట్‌ చేశారు. ‘కనబడుట లేదు.. డియర్‌ అను.. నువ్వు ఎక్కడున్నా రంగ్‌దే ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మా కోరిక. ఇట్లు నీ అర్జున్‌’ అంటూ ఆ ట్వీట్‌లో కీర్తి సురేశ్‌ చిన్ననాటి ఫొటోను పంచుకున్నారు. కాగా.. ఆ ట్వీట్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌లు స్పందించారు. ‘చింతించకండి నితిన్‌. మేము జాగ్రత్త తీసుకుంటాం’ అంటూ బదులిచ్చారు. దీనిపై నవ్వుతున్న ఎమోజీలతో మళ్లీ నితిన్‌ స్పందించారు. పోలీసుల చమత్కారానికి నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు.

Scroll to load tweet…

 ఆ క్రమంలోనే ఓ నెటిజన్ ..ప్రభాస్ అభిమాని రిప్లైగా ఓ ట్వీట్ చేసారు. ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పట్టుకోమని రిక్వెస్ట్ చేస్తూ సిటీ పోలీస్ లకు రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై ట్వీట్ ని మంచు మనోజ్ రీట్వీట్ చేయటంతో వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో ఫ్యాన్స్ యుద్దాలే కాదు..ఇలా ఫన్ కూడా ఓ రేంజిలో జరుగుతోందని అందరూ సండేపూట ఖుషీ అవుతున్నారు. 


ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘జిల్‌’ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను 2021 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్ర యూనిట్ ప్రణాళిక చేస్తునట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ : కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌ మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్ స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌ చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.