ఆదిపురుష్ మూవీ నచ్చలేదన్న వ్యక్తిని ప్రభాస్ అభిమానులు చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆదిపురుష్ మూవీ నేడు వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. అయితే అభిమానులు సినిమా అద్భుతం అంటున్నారు. ఆదిపురుష్ థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి ఆదిపురుష్ మూవీ బాగాలేదని అన్నాడు. ఆదిపురుష్ మూవీ ఎలా ఉందని మీడియా వాళ్ళు అడగ్గా, నచ్చలేదు. పెద్ద రాడ్ అని కామెంట్ చేశాడు. అక్కడే ఉన్న అభిమానులు చితకబాదారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆదిపురుష్ మూవీ ఆకట్టుకున్నప్పటికీ... విజువల్ ఎఫెక్ట్స్, రావణుడు గెటప్ నిరాశపరిచాయని అంటున్నారు.
ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ స్పెషల్ మూవీ. ఆయన ఐకానిక్ రాముని పాత్ర చేశారు. గతంలో ప్రభాస్ పౌరాణిక చిత్రం చేసింది లేదు. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్ర హీరోగా ప్రభాస్ ని ఎంచుకున్నారు. రాఘవుడు పాత్రకు ప్రభాస్ చక్కని ఎంపిక అని భావించారు. దర్శకుడు నమ్మకం వమ్ము కాలేదు. రాముడిగా ప్రభాస్ అద్భుతం చేశాడన్నమాట వినిపిస్తుంది.
టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆదిపురుష్ మూవీ నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జానకి పాత్ర చేశారు. సన్నీ సింగ్ లక్ష్మణుడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక కీలకమైన లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మెప్పించారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఫస్ట్ డే ఆదిపురుష్ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి.
