యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి సినిమాగా ఆదిపురుష్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌‌లో పట్టాలెక్కనున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి కాస్ట్, బడ్జెట్ మీద పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ముంబై టాబ్లెయిడ్స్ లో వస్తున్న వార్తల ప్రకారం.. ఆదిపురుష్‌‌ను రూ.450 కోట్ల బడ్జెట్‌‌తో తీయనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా నిమిత్తం జనవరిలో మొదలెట్టి కంటిన్యూగా 45 రోజులు పాటు తన డేట్స్ ని ప్రబాస్ కేటాయించినట్లు సమాచారం. 

అయితే ప్రస్తుతం కరోనా కారణంగా చాలా మంది మేకర్స్ సినిమాల బడ్జెట్లను తగ్గిస్తున్నారు. అయితే ఆదిపురుష్ మేకింగ్ విషయంలో వెనక్కి తగ్గొద్దని, ముందు అనుకున్న బడ్జెట్‌‌తోనే తెరకెక్కించాలని ప్రభాస్ నిర్ణయించారని తెలిసింది. బడ్జెట్‌‌లో ఎక్కువ భాగం వీఎఫ్‌‌ఎక్స్ వర్క్‌‌కే ఖర్చు చేయనున్నారు. దాంతో ఆదిపురుష్‌‌ సినిమా మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతోనే తీయనున్నారు. ఇందుకోసం అవతార్, స్టార్ వార్స్ లాంటి క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్టులకు పని చేసిన వీఎఫ్‌‌ఎక్స్ సూపర్‌‌వైజర్స్‌‌తో మూవీ మేకర్స్ సంప్రదించారని సమాచారం. 
 
ఈ సినిమాలో మేజర్ షేర్ 250 కోట్ల భారీ బడ్జెట్ ని గ్రాఫిక్స్ కోసం పెట్టనున్నారట. అంతా గ్రీన్ మ్యాట్ లోనే షూటింగ్ చేస్తారట. ఈ సినిమాలో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్ తో నిండి ఉంటాయి. అవతార్ స్దాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని, లొకేషన్స్ అన్ని విజువల్ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది. త్రీడిలో తీస్తున్న సినిమా,అదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది కావటంతో గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎక్సపర్ట్ అని తెలుస్తోంది. ఆది పురుషుడైన రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్న ఈ సినిమాలో కనిపించనున్న మిగతా నటీనటుల వివరాలను సినీ యూనిట్ త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.