`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈవెంట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రభాస్ కటౌట్ కూలిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీస్ `రాధేశ్యామ్`(Radheshyam). పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం ఆర్‌ఎఫ్‌సీలో గ్రాండ్‌గా జరిగింది. రెండేళ్ల తర్వాత Prabhas నుంచి సినిమా వస్తుండటంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఏకంగా 40వేల మంది అభిమానులు ఈ ఈవెంట్‌కి తరలి వచ్చారని తెలుస్తుంది. తెలుగు రాష్టాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
ఇదిలా ఉంటే `రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈవెంట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రభాస్ కటౌట్ కూలిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈవెంట్ జరుగుతున్న సమయంలో అభిమానులు కటౌట్స్ మీదికి ఎక్కారు. దాదాపు 40 మంది ప్రభాస్ కటౌట్ మీదికి ఎక్కారు. నిర్వాహకులు, పోలీసులు ఎంత విజ్ఞప్తి చేసిన అభిమానులు పట్టించుకోకపోవడంతో బరువెక్కువై కటౌట్ కూలిపోయిందట. కటౌట్ మీద నుంచి కింద పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యని.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. Radheshyam Pre Release Eventకు దాదాపు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించినట్టు తెలుస్తుంది. అభిమానులు కంట్రోల్ చేయడం వారికి కూడా కష్టంగా మారిందని సమాచారం.
`సాహో` వంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ చేస్తున్న లవ్ స్టోరీ నేపథ్య చిత్రం `రాధేశ్యామ్`. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. సైన్స్ కి, భవిష్యవాణికి మధ్య సంఘర్షణ ప్రధానంగా ఈ చిత్రం సాగుతున్నట్టు తెలుస్తుంది. విడుదలైన ట్రైలర్ ఆద్యంతం కనువిందు చేస్తుంది. గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. అదే సమయంలో సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య లవ్ స్టోరీ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, అది ఆద్యంతం హృదయాలను కదిలించేదిగా ఉండబోతుందని తెలుస్తుంది.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్`. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ఐదు ఇండియన్ లాంగ్వేజెస్‌లో విడుదల కాబోతుంది.
