తక్కువ గ్యాప్‌లోనే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి లాంటి సినిమాలు వరసగా చేసిన ప్రభాస్..ఆ తర్వాత మాత్రం జోరు పూర్తిగా తగ్గించేసాడు.బాహుబలి సినిమా కోసమే ఐదేళ్లు ఇచ్చేసాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ప్రభాస్ చాలా ఇబ్బందుల్లో పడేవారు. ఆ విషయం ప్రభాస్ గమనించాడు. బాహుబలి కోసం ఐదేళ్లు తీసుకున్నాను.. ఇకపై ఆ లోటు భర్తీ చేయడానికి ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తాను అంటూ సాహోకు ముందు ప్రామిస్ చేసాడు ప్రభాస్. సాహో వచ్చి ఏడాదిన్నర పైగా అయ్యింది. సాహోకు ముందు రెండేళ్లు తీసుకున్నాడు ప్రభాస్. 

ఇలా సినిమా రిలీజ్ కు రిలీజ్ కు మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తోంది. ఇప్పుడు “రాధే శ్యామ్” దీ అదే పరిస్దితి. ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా ఇంకా డైరక్టర్ సినిమాని చెక్కుతూనే ఉన్నాడు. ఇవన్నీ గమనించిన ప్రభాస్  ప్రభాస్ తాజాగా ఓ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం. 

కథ విని సినిమాపై సైన్ చేసేముందు డైరక్టర్స్ కు కొన్ని కండీషన్స్ పెడుతున్నారట. ఇక నుంచి మాగ్జిమం తన సినిమాలకు మూడు నెలలకు మించి తన డేట్స్ ఇవ్వ కూడదని భావిన్నాడు ప్రభాస్. అలాగే తనకు సంబంధించిన భాగం అంతా 60 వర్కింగ్ డేస్ లో పూర్తి చెయ్యాలనేది మెయిన్ కండీషన్. సినిమా మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉండాలి. ఇది ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండీషన్. ఈ కండీషన్ ని ఆల్రెడీ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కు పెట్టినట్లు సమాచారం.

దాంతో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది. ఏప్రిల్, మే నాటికి గుమ్మడికాయ కొట్టేలా ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తున్నాడు.మరో ప్రక్క ‘ఆదిపురుష్’ దర్శకుడు కూడా ప్రభాస్ లేకుండానే సినిమా షూటింగ్ జరిపిస్తున్నాడు. ”రాధేశ్యామ్’,‘సలార్’ రెండూ షూటింగ్ జరుపుకుంటున్నాయి. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే..2022 సంక్రాంతికి సలార్ వచ్చేస్తుంది. మరోవైపు అది విడుదలైన 8 నెలల్లోనే ఓం రౌత్ ఆదిపురుష్ రానుంది. ఈ చిత్రం ఆగస్ట్ 8, 2022కి విడుదలవుతుందని ఇప్పటికే చెప్పారు దర్శక నిర్మాతలు. ఇలా ప్రతీ ఆర్నెళ్లకు ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా 2023లో విడుదల కానుంది.