Prabhas Comments: చిన్నసినిమా చేస్తానంటున్న ప్రభాస్...? బాహుబలి పార్ట్3 గురించి ఏమన్నాడంటే...?
ఏమంటా బాహుబలి రిలీజ్ అయ్యిందో.. ఇక అప్పటి నుంచీ భారీ బడ్జెట్.. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్(Prabhas) బిజీ అయ్యాడు. మరి పెద్ద సినిమాలు బోర్ కొట్టాయో ఏంటో.. చిన్న సినిమా చేస్తానంటున్నాడు యంగ్ రెబల్ స్టార్..
బాహుబలి సినిమాతో ప్రభాస్(Prabhas) కెరీర్ ఒక్క సారిగా భారీ టర్న్ తీసుకుంది.ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఆతరువాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ కాస్తా యూనివర్సల్ స్టార్ ఇమేజ్ ను సాధించాడ ప్రభాస్(Prabhas). బాహుబలి తరువాత సాహో.. తరువాత ప్రభాస్ (Prabhas) నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన రాధేశ్యామ్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే.
ఆధునిక జ్యోతిష్యుడిగా ప్రభాస్(Prabhas) నటించిన రాధేశ్యామ్ పర్వాలేదు అనిపించాడు. ఈ సినిమా తరువాత తెరకెక్కుతున్న సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ తో పాటు స్పిరిట్ సినిమా కూడా భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే. అయిత పెద్ద సినిమాలు చేసీ చేసీ బోర్ కొట్టిందో ఏమో.. చిన్న సినిమా చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ మారుతీతో సినిమా చేస్తే.. ప్రభాస్ (Prabhas) చిన్న బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బాహుబలి, బాహుబలి 2 తర్వాత బాహుబలి పార్ట్3 ఎప్పుడంటూ చాలా మంది ప్రభాస్ దగ్గర అన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ లో కూడా చాలా రోజులు డిస్కర్షన్స్ జరిగాయి. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ లకు ఆడియన్స్ నుంచి ఆ ప్రశ్నలు ఎదురయ్యాయి.
తాజాగా ఈ విషయంలో ప్రభాస్(Prabhas) క్లారిటీ ఇచ్చాడు. ఓ గ్రూప్ ఇంటరాక్షన్ సందర్భంగా అతడు తన మనసులోని మాటను బయట పెట్టాడు. తానూ బాహుబలి పార్ట్3 చేయాలనుకుంటున్నానని చెప్పాడు. నామనసుకు దగ్గరైన మూవీ బాహుబలి. నా కెరీర్ లో అంతటి ప్రభావాన్ని చూపించిన సినిమా అది. బాహుబలి పార్ట్3 అనేది జరుగుతుందా..లేదా.. అన్నది తెలియదు. కాని జరిగితే బాగుండు అని మాత్రం తాను కోరకుంటున్నా అన్నాడు. అయితే ఈసినిమా ఇప్పటికిప్పుడైతే జరిగే ప్రసక్తే లేదు. రాజమౌళి అనుకుంటేనే బాహుబలి పార్ట్ 3 సాధ్యమవుతుంది అన్నారు ప్రభాస్ (Prabhas).
ఎన్ని సినిమాలు వచ్చినా చాలా మంది ఆడియన్స్ Prabhas ను బాహుబలి ప్రభాసే అంటారు. ఈ సినిమా ప్రభావం వారిలో అమితంగా ఉందని ప్రభాస్ అన్నారు. అంతే కాదు ప్రతిసారీ ప్రభాస్(Prabhas) ను బాహుబలిలాగానే చూడాలనేలా వారిలో ఈసినిమా నాటుకుపోయిందని అన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.