ఇప్పటికే ఇతర దేశాల్లో కల్కి మూవీ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా బుకింగ్స్ కు సంబంధించి క్లారిటీ వస్తుంది. 


ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి. ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) సినిమా విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. అలాగే ఇప్పటికే ఇతర దేశాల్లో కల్కి మూవీ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా బుకింగ్స్ కు సంబంధించి క్లారిటీ వస్తుంది. అలా అభిమానులు అంతా ఈ కల్కి హడావిడిలో ఉంటే ఊహించని విధంగా చక్రం సినిమా రీరిలీజ్ కు పెట్టి షాక్ ఇచ్చారు.

 గత కొంతకాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు (Mahesh Babu) ప్రభాస్ (Prabhas) చిరంజీవి (Chiranjeevi) బాలకృష్ణ (Nandamuri Balakrishna) , రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ లు (Jr NTR) నటించిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలను విడుదల చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే చక్రం సినిమాని బయిటకు తెస్తున్నారు.

 ప్రభాస్ కెరియర్ లో భారీ డిజాస్టర్ అయిన చిత్రంగా చక్రం (Chakram) గురించి అని చెబుతారు. కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఏదో చెప్దామని ఏదో చెప్పినట్లు ఉంటుంది. యాక్షన్ హీరోగా ఎదుగుతున్న ప్రభాస్ ని ఎమోషన్ పర్శన్ ఆద్యంతం ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూనే మరోవైపు మంచి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు. అయితే వర్కవుట్ కాలేదు. 

 మాస్ ఇమేజ్ వచ్చిన తరువాత ప్రభాస్ చనిపోయే పాత్రలో నటించడం ఆడియెన్స్ తట్టుకోలేకపోయారు. దీంతో సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక పోస్టర్ తో చక్రం మూవీని అతి త్వరలో రీరిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఇప్పుడీ సినిమాను సరిగ్గా “కల్కి 2898 AD” రిలీజ్ అవుతున్న ఇదే నెలలో విడుదల చేయబోతున్నారు. ఈనెల 8న ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది.