బాహుబలి తరువాత ప్రభాస్ తీసుకున్న గ్యాప్ సినిమాల పరంగా చాలా ఎక్కువే అయినా షూటింగ్ వైజ్ గా చూసుకుంటే గత ఏడాది నుంచి తీరిక లేకుండా గడుపుతున్నాడు. రెండు బడా ప్రాజెక్ట్స్ ఎలాగైనా ఫినిష్ చెయ్యాలని రెస్ట్ తీసుకోవడం లేదు. ప్రస్తుతం సాహో సినిమాకు ప్రభాస్ ఫినిషింగ్ టచ్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. 

పనిలో పనిగా రి రాధాకృష్ణ డైరెక్షన్ లో లవ్ స్టోరీని కూడా ఫినిష్ చెయ్యాలని కష్టపడుతున్నాడు. యూరప్ లో ఇదివరకే సినిమాకు సంబందించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించిన చిత్ర యూనిట్ గురువారం నుంచి హైదరాబద్ అన్నపూర్ణస్టూడియోలో ఒక షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుంది. 16 రోజుల పాటు ప్రభాస్ రెస్ట్ తీసుకోకుండా ఈ షెడ్యూల్ లో పాల్గొంటాడట. 

జిల్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధా కృష్ణ ఇప్పుడు ప్రభాస్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను 2020 మొదట్లోనే విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.