రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా విడుదల కాకముందే నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. సినిమాపై పెరిగిన అంచనాలు మాములుగా లేవు. ఇక రీసెంట్ గా రిలీజైన సాహో ట్రైలర్ కూడా సినిమాపై ఉన్న క్రేజ్ ని మరింత పెంచేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రభాస్ వచ్చే ఏడాదిలో రెండు సినిమాలని రిలీజ్ చేస్తాడట. 

ఈ వంకతో పెళ్లి నుంచి తప్పించుకోవచ్చని ఫ్యామిలీ మైండ్ ని డైవర్ట్ చేసేందుకు రెబల్ స్టార్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా తరువాత పెళ్లి చేసుకుంటానని ఫ్యామిలీ ని ఒప్పించినా డార్లింగ్ సాహోతో బిజీగా మారి ఆ ప్రాజెక్ట్ అయిపోగానే చేసుకుంటానని ఈ ఏడాది ఫస్ట్  హాఫ్ నుంచి తప్పించుకున్నాడు. ఇక వచ్చే ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేస్తానని ప్రభాస్ కుటుంబ సబ్యులకు మరో షాక్ ఇచ్చాడు. 

గత కొన్ని వారాలుగా ప్రభాస్ కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలనీ ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్నారై అమ్మాయ్ ని కూడా చుసినట్లు టాక్ వచ్చింది. అవి ఎంతవరకు నిజమనే విషయం పక్కనపెడితే కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ ఏడాది ప్రభాస్ కి తప్పనిసరిగా పెళ్లి చేయాలనీ అనుకున్నారు. కానీ మ్యారేజ్ లైఫ్ తో జీవితం ఫ్రీగా సాగదని ప్రభాస్ పెళ్లంటే వద్దంటున్నాడు. 

అటు ఫ్యామిలీని బాధపెట్టలేక, నొప్పించకుండా ఆ క్షణానికి ఎదో వంక చెప్పి సస్పెన్స్ లో పెడుతున్నాడు. రీసెంట్ గా ముంబైలో జరిగిన సాహో ట్రైలర్ లాంచ్ లో నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలను ఎలాగైనా రిలీజ్ చేస్తానని ప్రభాస్ చెప్పాడు. ఒక సినిమా వంకతో తప్పించుకున్న ప్రభాస్ రెండు సినిమాలతో తప్పించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. 

మరి కృష్ణంరాజు గారు ఈ బ్యాచురల్ హీరో పెళ్లి కోసం ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.  ఇదివరకే జిల్ దర్శకుడు కె.రాధాకృష్ణ ప్రభాస్ తో ఒక లవ్ స్టోరీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక మరో ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఈ మల్టీస్టారర్ సినిమాలొస్తే బాలీవుడ్ భయపడాల్సిందే

సాహో క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్