Asianet News TeluguAsianet News Telugu

#Prabhas:స్టార్ డైరక్టర్ స్టోరీ లైన్ ఓకే చేసిన ప్రభాస్,త్వరలో ఎనౌన్సమెంట్

ఇప్పటికే ప్రభాస్ కు ఓ ఐడియా చెప్పి ఒప్పించారని తెలుస్తోంది.  ఈ ప్రాజెక్టుని ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తారు. 

Prabhas and Sukumar film on Cards
Author
First Published Dec 26, 2022, 1:48 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్న సంగితి తెలిసిందే.  ఇప్పటికే చేతిలో ఇప్పుడు అనేక పెద్ద ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్టు కమిటయ్యారని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు సుకుమార్. అందుతున్న సమాచారం మేరకు 2024లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ కు ఓ ఐడియా చెప్పి ఒప్పించారని తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్టుని ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తారు. సెన్సేషన్ క్రియేట్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ భారీ బడ్జెట్ ప్రయత్నానికి సహ నిర్మాతగా భావిస్తున్నారు. ప్రభాస్, సుకుమార్‌ల మీటింగ్ పూర్తైన తర్వాత వారికి భారీ అడ్వాన్స్‌లు చెల్లించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

 వాస్తవానికి రంగస్థలం రిలీజ్ కి ముందే ప్రభాస్ ని కలిసి సుకుమార్ స్టోరీ చెప్పారంట. కథకి ప్రభాస్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని అన్నారు.  అయితే అప్పటి నుంచి ప్రభాస్ బిజీగా ఉన్నారు. సుకుమార్ పుష్ప ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లకి ఇద్దరికి టైమ్ వచ్చింది.  ప్రభాస్.. సుకుమార్ ప్రాజక్ట్ ని పట్టాలెక్కించనున్నారు.  ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా షూటింగ్ ను 85% పూర్తి చేసేసారు. వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కే” అనే సినిమాతో బిజీ కాబోతున్నారు.

ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ధర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అలాగే దిల్ రాజు మరియు మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ప్రభాస్ కమిట్‌మెంట్స్‌తో ఉన్నాడు. సరైన డైరక్టర్స్ ని... ప్రభాస్ కు సెట్ చేయటం ఆ నిర్మాతలకు కష్టంగా మారడంతో ప్రాజెక్టులు ఇంకా కార్యరూపం దాల్చలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios