ఒక్కోసారి హీరోల జడ్జ్‌మెంట్‌ దారుణంగా ఫెయిల్ అవుతుంటుంది. కొన్ని కథలు బాగాలేవని రిజెక్ట్ చేస్తే అదే కథ మరో హీరోకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి ఓ డిఫరెంట్ స్టోరీనే కిక్‌. రవితేజ హీరోగా స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా కిక్‌. ఈ సినిమాలో రవితేజకు జోడిగా గోవా బ్యూటీ ఇలియానా నటించింది. ఆర్‌ ఆర్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వెంకట్‌ నిర్మించిన ఈ సినిమా 2009 మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అంటే సరిగ్గా శుక్రవారానికి ఈ సినిమా రిలీజ్‌ అయి 11 ఏళ్లు. ఈ సందర్భంగా మరోసారి కిక్‌ సినిమాకు సంబంధించిన వార్తలు మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ముందుగా ఈ సినిమాకు హీరోగా రవితేజను అనుకోలేదట. కథ తీసుకున్న తరువాత ఈ సినిమాను ముందగా ప్రభాస్‌ హీరోగా చేయాలని భావించాడట.

అయితే ప్రభాస్ అంగీకరించకపోవటంతో తరువాత అదే కథతో ఎన్టీఆర్‌ను సంప్రదించాడు. కానీ అప్పట్లో ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్‌కు ఈ కథ సూట్ అవ్వదన్న ఉద్దేశంతో తను కూడా రిజెక్ట్ చేయటంతో ఫైనల్‌గా కిక్‌ స్టోరి రవితేజ దగ్గరకు వెళ్లింది. అప్పట్లో వరుస ఫ్లాప్‌లలో ఉన్న రవితేజ, వెంటనే ఈ సినిమాకు ఓకె చెప్పేశాడు. కేవలం 10 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన కిక్‌ 25 కోట్ల వసూళ్లు సాధించి అప్పట్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. సురేందర్‌ రెడ్డి స్టైలిష్‌ టేకింగ్‌, తమన్ మ్యూజిక్, కామెడీ ఇలా అన్ని కలిసి కిక్‌ సినిమాను బిగ్గెస్ట్ హిట్‌గా నిలబెట్టాయి.
Kick (2009)