పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు, వాటి అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభాస్ మూవీ నుండి అప్డేట్ కోసం నెలల తరబడి ఎదురు చూసిన ఫ్యాన్స్ కి, రోజుల వ్యవధిలో అప్డేట్స్ అందుతున్నాయి. కాగా నేడు ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ విడుదల తేదీ ప్రకటించేశారు చిత్ర బృందం. సలార్ 2022 ఏప్రిల్ 14న సమ్మర్ కానుకగా సలార్ విడుదల కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 


ఇక ప్రకటన పోస్టర్ లో ప్రభాస్ లుక్, మాస్ అండ్ ఫెరోషియస్ గా ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటరైనర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఉన్న ఇమేజ్ కు ప్రభాస్ మేనియా తోడు కావడంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఈ కాంబినేషన్ లో మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 


ఇటీవలే సలార్ షూటింగ్ తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖని మైనింగ్ ఏరియాలో మొదలుపెట్టడం జరిగింది. ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ నందు హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొన్నారు. కెజిఎఫ్ నిర్మాతలు హోమబుల్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా సలార్ తెరకెక్కిస్తున్నారు. 


మరోవైపు ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ డ్రామా జులై 30న విడుదల కానుంది. ఇక దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ రామాయణ గాథగా తెరకెక్కిస్తుండగా, ప్రభాస్ రామునిగా కనిపించనున్నాడు.