Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకు ప్రభాస్‌, గోపిచంద్‌, బుల్లితెర టీఆర్పీలు బ్లాస్ట్ అవుతాయంటున్న ఫ్యాన్స్

బాలయ్య ఓ షోకు హోస్టింగ్ చేయడమే విశేషం...అది సూపర్ సక్సెస్ అవ్వడం.. అందులో  స్టార్ సెలబ్రిటీస్ సందడి చేయడంతో.. ఆహాలో దూసుకుపోతోంది ఈ షో. ఇక త్వరలో బుల్లితెర బ్లాస్ట్ అయ్యేలాంటి ఎపిసోడ్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు తీసురాబోతున్నట్టు తెలస్తోంది.  
 

Prabhas And Gopichand in Balakrishna Unstoppable Season-2
Author
First Published Dec 2, 2022, 3:54 PM IST

నందమూరి నట సింహం  బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో  సూపర్ సక్సెస్ ఫ్యూస్ తో దూసుకుపోతోంది అన్ స్టాపబుల్ షో.  ఫస్ట్ సీజన్ ను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా లాంచ్ చేసుకున్నారు టీమ్. ఈసారి సినిమావాళ్లతో పాటు.. పొలిటికల్ లీడర్స్ కూడా ఈ షోలో సందడి చేస్తున్నారు. ఈ రకంగా డబుల్ ధమాకా సందడితో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 లో బాక్ బస్టర్ ఎపిసోడ్ కు ప్లానింగ్ జరుగుతుంది. 

ఇక బాలయ్య  ఫుణ్యమా అని ఎప్పుడూ..  ఏ టాక్ షోలకు రాని సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేస్తున్నారు. బాలకృష్ణ హోస్ట్‌గా చేయడం వల్ల ఇలా జరుగుతుందంటున్నారు ఫ్యాన్స్.  ఆయన హోస్ట్ అవ్వడంతో అందరిలోనూ ఓ పాజిటీవిటి ఏర్పడింది. ఇక ఎప్పుడూ టాక్ షోలకు రాని వారని కూడా ఈ షోకు రప్పించడంతో సూపర్ సక్సెస్ అవుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే  తాజాగా ఈ టాక్‌ షోకు స్టార్‌ హీరోలు ప్రభాస్‌, గోపిచంద్‌ గెస్ట్‌లుగా రాబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ గట్టిగా నడుస్తుంది. 

నిప్పులేనిదే పొగ రాదన్నట్టు.. ఇప్పటి వరకూ ఎవరెవరు వస్తారో ఊహించి జరిగిన  ప్రచారం ప్రకారం ఆ సెలబ్రిటీలే వచ్చారు. ఇప్పుడు కూడా వీరిద్దరి రాక పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు  వీళ్ల ఎపిసోడ్‌ను డిసెంబర్‌ 11న షూట్‌ చేయనున్నట్లు టాక్‌. అంతేకాకుండా ఈ ఎపిసోడ్‌ను న్యూయర్‌ సందర్భంగా రిలీజ్‌ చేయాలని ఆహా సంస్థ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కాని బయట ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతుంది. 

ప్రభాస్‌-గోపిచంద్‌ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరు  కలిసి వర్షం సినిమాలో ఫస్ట్ టైమ్ నటించారు. అప్పటి నుంచీ వీరి మధ్య స్నేహం కూడా పెరుగుతూ వస్తుంది. అంతే కాదు బయట వీరిద్దరు కలిసి బాగా తిరుగుతారు కూడా. రీసెంట్ గా ప్రభాస్ పెదనాన్న కృష్ణ రాజు మరణించినప్పుడు కూడా ప్రభాస్ వెంటే ఉన్నాడు గోపీచంద్. ఇక  గోపిచంద్‌ కూడా చాలా ఇంటర్వూలలో  ప్రభాస్ తనకు బెస్ట్‌ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇక వీరిద్దరు కలిసి అన్ స్టాపబుల్ షోలో కనిపిస్తే.. ఎంత రచ్చ జరుగుతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక వీరిద్ధరూ కలిసి మొదటి సారిగా ఒక టాక్ షోకు రానుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇక గోపిచంద్‌ కూడా తన ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుతుపుతున్నాడు.ఇక అన్ స్టాపబుల్ గురించి చూస్తే.. ఈ మధ్య కాలంలో ఈ టాక్‌ షోకు వచ్చినంత క్రేజ్‌ దేనికి రాలేదు. అది అందరికి తెలిసన నిజమే.. సీజన్‌-1 భారీ రెస్పాన్స్ సాధించడంతో   ఆహా ఓటీటీ సంస్థ సీజన్‌-2ను డిఫరెంట్ గా డిజైన్ చేసింది. ఇటీవలే స్టార్ట్‌ చేసింది. మొదటి ఎపిసోడ్‌ నుండి ఈ టాక్‌ షో మంచి వ్యూవర్‌షిప్‌ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖులతో పాటు.. ఈసారి పొలిటీషియన్స్‌  కూడా ఈ షోలో సందడి చేస్తుండటంతో.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. 

Follow Us:
Download App:
  • android
  • ios