యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు ఇండియా మొత్తం బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడే మార్కెట్ సొంతం అయింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ప్రభాస్ అనుష్క గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. 

ప్రభాస్, అనుష్క కలసి బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించారు. వీరిద్దరిది వెండి తెరపై సూపర్ హిట్ పెయిర్. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ అనుష్క మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి. అలాగే ప్రభాస్, అనుష్క కూడా పలు సందర్భాల్లో ఈ వార్తలని ఖండించారు.  

కానీ ప్రభాస్, అనుష్క కేంద్రంగా ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ముంబై మిర్రర్, ఇండియా టుడేలలో ప్రభాస్, అనుష్క రిలేషన్ గురించి ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం లాస్ ఏంజిల్స్ లో ఈ జంట సొంతంగా ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మంచి ఇంటి కోసం లాస్ ఏంజిల్స్ లో ఇప్పటికే వేట మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి అనేక వార్తలు వస్తున్నా.. యంగ్ రెబల్ స్టార్ మాత్రం ఇప్పట్లో ఆ ఊసెత్తేలా కనిపించడం లేదు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు.