Prabhas: అందుకే హడావిడిగా ప్రభాస్ ప్రాజెక్టులు ఫినిష్?, అసలు సీక్రెట్ ఇదే
అయితే ప్రభాస్ ఎందుకిలా కంగారుపడుతున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందా అని కొందరు ఆలోచనలో పడుతున్నారు. డిస్కషన్స్ మొదలెట్టేసారు. అయితే అసలు విషయం వేరే ఉంది అంటున్నారు.
ప్రభాస్(Prabhas) గత కొద్ది రోజులుగా తను ఓకే చేసిన ప్రాజెక్టుల షెడ్యూల్స్ విషయమై డైరక్టర్స్ తో డిస్కస్ చేసి డేట్స్ ఫైనల్ చేస్తున్నట్లు వినికిడి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన పార్ట్ ఫినిష్ చేసుకోమని, పక్కా ప్లానింగ్ తో వెళ్లమని హెచ్చరిస్తున్నారట. `రాధేశ్యామ్`(Radheshyam) లాగ తను ఎక్కువ కాలం ఒకే ప్రాజెక్టుపై ఉండలేనని క్లారిటీగా చెప్పేసారట. అయితే ప్రభాస్ ఎందుకిలా కంగారుపడుతున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందా అని కొందరు ఆలోచనలో పడుతున్నారు. డిస్కషన్స్ మొదలెట్టేసారు. అయితే అసలు విషయం వేరే ఉంది అంటున్నారు.
అదేమిటంటే...నాగ్ అశ్విన్ తో తను చేయబోయే చిత్రం` ప్రాజెక్టు కే` అని అంటున్నారు. ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇప్పటికే కేటాయించారట Prabhas. అలాగే ప్రస్తుతం చేస్తున్న లాంగ్ షెడ్యూల్ పూర్తయ్యాక కూడా మరోసారి పెద్ద షెడ్యూల్ కే ప్లాన్ చేస్తున్నారట. దాంతో బాహుబలి తరహాలో చాలా డేట్స్ అవసరం అవుతాయట. అందుకోసం మిగతా ప్రాజెక్టులకు ఇబ్బంది కలగకుండా వారితో డిస్కస్ చేసి,వెయిట్ చేసి మరీ ఈ ప్రాజెక్టులోకి వచ్చారట.
అందుకే `ప్రాజెక్ట్ కె` షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంత టైమ్ పట్టింది. కొన్నిరోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించే ప్లాన్ చేసారు. కానీ రకరకాల కారణాలతో ముందుకు వెళ్ళలేదు. క్వాలిటీ విషయంలో `ప్రాజెక్ట్ కె.. ఏ మాత్రం తగ్గకూడదని ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా ప్లాన్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రాజెక్ట్ కెకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అశ్విని దత్.. సైతం ప్రభాస్ డేట్స్ బల్క్ గా కావాలని, లుక్ కోసం తప్పదని చెప్పారట.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయినా కూడా.. దీనికి చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరమని, ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులు చూడని సినిమా అవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే అన్ని పనులు పూర్తి చేసుకుని 2023 ఏప్రిల్ లేదా మేలో `ప్రాజెక్ట్ కె` ప్రేక్షకుల ముందుకు రానుందని అశ్విని దత్ స్పష్టం చేశారు.