వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). అన్ని సినిమాలను సెట్స్ ఎక్కించాడు. ఇక్క ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నాడు.

వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). అన్ని సినిమాలను సెట్స్ ఎక్కించాడు. ఇక్క ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హరోగా.. కృతి సనన్(Kriti Sanon) ప్రభాస్ జంటగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈమూవీలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ) (Saif Ali Khan) నటిస్తున్నారు. రాముడిగా ప్రభాస్.. సీతగా కృతీ సనన్.. రావణాసురిడిగా సైఫ్ ఆదిపురుష్ లో కనిపించబోతున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిచాంరు మూవీ టీమ్. ఆదిపురుష్ (Adipurush) ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకుగా రిలీజ్ చేయబోతున్నారు. 12 జనవరి 2023న ఆదిపురుష్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి సందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. గతంలో ఈ సినిమాను ఆ ఏడాది అగష్ట్ 11 న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన టీమ్ లాంగ్ గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాదికి రీలీజ్ ను మార్చుకుంది.

View post on Instagram

ఆదిపురుష్(Adipurush) రిలీజ్ కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ప్రభాస్ (Prabhas). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది. స్టార్ట్ అయిన అప్పటి నుంచీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకున్నారు ఆది పురుష్ టీమ్. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతే ఈ ఏడాది రిలీజ్ చేసుకునే వీలు ఉంది. కాని ఆదిపురుష్ ను నెక్ట్స్ ఇయర్ వరకూ తీసుకెళ్లారు. త్వరలో ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ కాబోతోంది. అటు సలార్ కూడా షూటింగ్ దాదాపు కంప్లీట్ అవుతుంది.

ఒకే ఏడాది ఇన్ని సినిమాలు రిలీజ్ ఎందుకు అని ప్రభాస్ (Prabhas) అనుకున్నాడో ఏమో.. వచ్చే ఏడాది ఆదిపురుష్ తో శుభారంభం ఇద్దామని డిసైడ్ అయ్యాడు. ఈ ఏడాది రాధేశ్యామ్ తో పాటు సలర్ ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక అటు నాగ్ అశ్వీన్ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ ఈ ఏడాదంత కొనసాగే అవకాశం ఉంది. దాంతో ఆ మూవీ రిలీజ్ ఈ ఏడాది ఉండే అవకాశం లేదు. దాంతో వచ్చే ఏడాది ఆదిపురుష్ తో పాటు.. నాగ్ అశ్వీన్(Nag Aswin)  మూవీ ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.