ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం   నెగిటివ్ టాక్ తెచ్చుకొని విపరీతమైన విమర్శలతో నడుస్తోన్న కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గలేదు. మొదటి వారంలో 73.27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇంకా హవా కొనసాగిస్తోంది. 

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) రాముడు, సీత పాత్రలతో రామాయణం ఆధారంగా తీసిన సినిమా 'ఆదిపురుష్' #Adipurush. ఈనెల 16న థియేటర్స్ లో విడుదల అయ్యింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (OmRaut)డైరక్ట్ చేసిన సినిమాకి రిలీజ్ కు ముందు బాగా హైప్ వచ్చింది.  అయితే అనుకోని విధంగా సినిమా విమర్శలు, వివాదాల పాలైంది. హనుమంతుడు డైలాగులు గురించి, రావణాసురుడు పాత్ర గెటప్ పైనా, గ్రాఫిక్స్ పైనా అనేక విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా నిరశనలు వచ్చాయి. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ వీకెండ్ బాగున్నా..ఆ తర్వాత డల్ అయ్యిపోయాయి. సినిమాకు నెగిటివ్ టాక్ రావటంతో చాలా మంది ఈ సినిమాని చూడలేదు. వాళ్లంతా  సినిమా ఓటిటి లో ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అందులోనూ ఈమధ్య థియేటర్స్ లో విడుదల అయిన సినిమాలు తొందరగానే ఓటిటి లో వచ్చేస్తున్నాయి కాబట్టి, ఈ ‘ఆదిపురుష్’ #Adipurush కూడా తొందరగానే వచ్చేస్తుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు వస్తుంది ఈ చిత్రం అంటే..

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ...ఆగస్ట్ 11 లేదా ఆగస్ట్ 15 న ఉండ వచ్చని తెలుస్తోంది.ఈ రెండు రోజుల్లో ఒక రోజు ఓటిటి స్ట్రీమింగ్ మొదలెట్టే అవకాసం ఉందంటున్నారు. ఆగస్ట్ 11 న భోళాశంకర్, హిందీలో యానిమల్ చిత్రాలు రిలీజ్ ఉండటంతో ఆగస్ట్ 15 న ఓటిటి స్ట్రీమింగ్ చేయవచ్చని చెప్తున్నారు. అందులోనూ  ‘ఆదిపురుష్’ సినిమా థియేటర్ లో విడుదల అయిన ఎనిమిది వారల తరువాత మాత్రమే ఓటిటి లో ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎందుకంటే ఈ సినిమాని థియేటర్ లోనే ఆస్వాదించాలని, అందుకు తగ్గట్టుగా అన్ని హంగులతో తీశామని, ఈ సినిమాకి సుమారు రూ 500 కోట్ల వరకు ఖర్చు పెట్టారని అంటున్నారు. అందువల్ల ఈ సినిమాని కేవలం థియేటర్ లో మాత్రమే చూస్తే ఆ అనుభవం వేరుగా ఉంటుందని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. ఈ సినిమా ఓటిటి అమెజాన్ ప్రైమ్ (AmazonPrime) భారీ రేటుకు తీసుకుంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగిన కలెక్షన్స్ అయితే రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా వసూళ్లకు సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. జూన్ 16వ తేదీన విడుదలైన ఈ సినిమా నిన్నటితో 10 రోజుల రన్ ఫినిష్ చేసుకుంది. అయితే ఇప్పటివరకు అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 450 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. 2డీ, 3డీలో ఐదు భాషల్లో భారీ ఎత్తున ఈ ఆదిపురుష్ సినిమాను విడుదల చేశారు. భారీ తారాగణం ఎంచుకున్న దర్శకనిర్మాతలు.. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ లను ఈ సినిమాలో భాగం చేశారు. చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటించగా.. కృతి సనన్ సీతగా కనిపించారు.