Asianet News TeluguAsianet News Telugu

రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్, ఆదిపురుష్ నుంచి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్, దిల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టైమ్ రానే వచ్చింది. ప్రభాస్ చేస్తున్న సినిమాల నుంచి అప్ డేట్ కోసం కళ్లు  కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు ఆదిపురుష్ టీమ్. 
 

Prabhas Adipurush Movie teaser poster and Release Date
Author
First Published Sep 30, 2022, 7:59 AM IST

రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడా అని  చాలా కాలంగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా.. ఎవరి పిక్చర్స్ వారు ఊహల్లో  ప్రింట్ వేసుకుంటూ వచ్చారు.  అలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఊహించుకునే అవసరం లేకుండా రాముడిగాప్రభాస్ లుక్ ను గిఫ్ట్ గా ఇచ్చారు మేకర్స్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా..  బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఇప్పటికే  ఈ సినిమాపై  దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను ఫస్ట్ లుక్ తో మరింత పెంచారు టీమ్. ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన సీతగా  బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా  కీలకపాత్రలలో నటిస్తున్నారు. 

దాదాపు 500 కోట్ల రూపాయల భారీ  బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ అయిపోయి చాలా కాలం అవుతుంది. కాని ఈ సినిమాకు సంబందించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. షూటింగ్ అయిపోయినా కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ అయినా ఇవ్వకపోవడంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. పలు సందర్భాల్లో వారి అసహనం వెల్లడించారు. దాంతో మేకర్స్ ప్రభాస్ రాముడి అవతారంలో ఉన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 

 

 

ఇక తాజాగా  ఆదిపురుష్  నుంచి  టీజర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ పోస్టర్ లో ప్రభాస్ విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టి కనిపించారు. టోన్డ్ బాడీతో .. డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు. ఇన్నాళ్లు మనం చూసిన రాముడు ఒకరకంగా ఉంటే.. రాముడిగా ప్రభాస్ లుక్ కొత్తగా అనిపించింది. దాంతో ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా టైటిల్ కింద చేడు పై మంచి సాధించిన విజయం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు టీమ్.  తెలుగు,తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పోస్టర్ ను వదిలారు టీమ్. 

అంతే కాదు ఆదిపురుష్ టీజర్ ను అక్టోబర్ 2న రాముడి జన్మస్థానం అయిన అయోధ్యలో రిలీజ్ చేయబోతున్నారు.  ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ కు  ప్రభాస్, కృతి సనన్  జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతగా కృతిసనన్, లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

బాహుబతి తరువాత ప్రభాస్ చేసిన రెండు పాన్ ఇండియా  సినిమాలు నిరాశపరిచాయి. దాంతో  రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సాలిడ్ హిట్ కోసం  డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆది పురుష్ తో పాటు ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్వీన్ తో ప్రాజెక్ట్ కే, సందీప్ వంగాతో స్పిరిట్, మారుతితో మరో సినిమాను లైన్ లోపెట్టాడు ప్రభాస్. ఈసారైనా ఫ్యాన్స్ కోరకుకున్నట్టు సాలిడ్ హిట్ ఇస్తాడా లేదా చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios