మొదటి నుంచి వివాదాల సుడిలోనే తిరుగుతూ వస్తోంది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా. ఎన్నో విమర్షల మధ్య ట్రైలర్ రిలీజ్ అయ్యి.. పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది అనుకుంటే.. మరోకాంట్రవర్సీ చట్రంలో చిక్కుకుంది భారీ బడ్జెట్ మూవీ.  

మొదటి నుంచి వివాదాల సుడిలోనే తిరుగుతూ వస్తోంది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా. ఎన్నో విమర్షల మధ్య ట్రైలర్ రిలీజ్ అయ్యి.. పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది అనుకుంటే.. మరోకాంట్రవర్సీ చట్రంలో చిక్కుకుంది భారీ బడ్జెట్ మూవీ. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్ సీతగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. సైఫ్ అలీఖాన్ రావణ బ్రహ్మగా నటిస్తున్న ఈసినిమా జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ మూవీపై మొదటి నుంచీ నెగెటీవ్ టాక్ నడుస్తోంది. ఆరడుగుల ప్రభాస్ రాముడిగా.. అద్భుంగా చూపించే వీలు ఉంటే.. తోలుబొమ్మలాటలా చేశారంటూ విమర్ష మొదలయ్యింది. ఈమూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ పై గట్టిగా విమర్షలు స్టార్ట్ అయ్యాయి. అవి అంతటితో ఆగకుండా రామాయణాన్ని పరిహాసం చేస్తున్నారంటూ.. హిందూవాదులు సినిమాపై విమర్షలు మొదలు పెట్టారు. 

వారికి తగ్గట్టుగానే ఓం రౌత్ ఓవర్ గ్రాఫిక్స్ తో.. మూవీని ఎటు తీసుకెళ్తాడో అని ప్రభాస్ ఫ్యాన్స్ భయపడ్డారు. ఇక టీజర్ దెబ్బ గట్టిగా తగలడంతో.. ఓం రౌత్ కాస్త మేలుకున్నాడు.. గ్రాఫీక్స్ వర్క్ ను మళ్ళీ రీ సెట్ చేయించాడు. శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్ డేట్స్ ఇస్తా అని ప్రకటించాడు. అనుకున్నట్టే..వర్క్ ఫాస్ట్ గా చేయించి.. పోస్టర్స్ ద్వారా సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచాడు. ఇక ఈక్రమంలోనే రీసెంట్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తే ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఓం రౌత్. 

ఇక ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్ వల్ల వచ్చిన బ్యాడ్ నేమ్ పోయింది. రాముడిగా ప్రభాస్ అద్భుతంగా కనిపించాడు. మిగతా పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది నా రాముడి కథ అంటూ ఆంజనేయుడి నేరేషన్.. ప్రభాస్ రాముడిగా అద్భుతమైన ఆకారంతో పాటు ఓ డిఫరెంట్ డైలాగ్ కూడా వినిపించింది. జానకి ప్రాణం కంటే ధర్మం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావా అన్న అర్ధంలో ఓ డైలాగ్ ప్రముఖంగా వినిపిస్తుంది. నా ప్రాణం జానకి.. నా ప్రాణం కంటే కూదా ధర్మం గొప్పదన్నట్టుగా... రాముడిగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ గట్టిగా వినిపిస్తోంది. 

కాని ఆ గ్రాఫిక్స్ ప్రభావం.. కథలో మార్పులు ఉండే అవకాశం ఉందా..అది రామాయాణాన్ని ప్రేక్షకుల దగ్గరకు తప్పుగా తీసుకెళ్లే ప్రభావం ఉంటుందేమో అన్న అనుమానం కొంత మందిలో కలిగింది. దాంతో ఆదిపురుష్ సినిమా మరో కాంట్రవర్సీని ఎదురుకో తప్పడంలేదు. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమాపై సెన్సార్ బోర్డులో తాజాగా ఓ ఫిర్యాదు నమోదైంది. ఈమూవీని రిలీజ్ చేసేముందు తాము కూడా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు సనాతన ప్రచారకర్తలు. 

సనాతన్ ఘర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ.. బాంబే హైకోర్టు లాయర్ ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా ఈ కంప్లైంట్ ఇచ్చారు. థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ముందు.. స్పెషల్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేయాలని.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ఆదిపురుష్’ టీమ్ మెంబర్స్ గతంలో ఆర్టిస్టులు, పోస్టర్ల విషయంలో చాలా తప్పులు చేశారని పేర్కొన్నారు. ఒకవేళ అవి సినిమాలోనూ ఉంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. దీనివల్ల శాంతిభద్రతల ముప్పు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. దాంతో ఆదిపురుష్ కు మర్ ఇబ్బంది తప్పేట్లు కనిపించడంలేదు.