Asianet News TeluguAsianet News Telugu

`కల్కి`లో ప్రభాస్‌ అసలు ఫస్ట్ లుక్‌ ఇదే.. కాన్సెప్ట్ అదిరింది.. కానీ

నిన్న అక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్‌ చెబుతూ, `కల్కి2898ఏడీ` నుంచి ఓ లుక్‌ని విడుదల చేశారు. అసలు ఫస్ట్ లుక్‌ ఇదేనట. టీమ్‌ ఆశ్చర్యపరిచింది. 

prabhas actual first look design from kalki2898ad arj
Author
First Published Oct 24, 2023, 8:01 AM IST

ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `కల్కి2898ఏడీ` ఒకటి. మైథలాజికల్‌ సైన్స్ ఫిక్షన్‌ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. 

ఇటీవల విడుదలైన `కల్కి2898ఏడీ` టీజర్‌ ఆకట్టుకుంది. అయితే దీనిపై చాలా వరకు విమర్శలు వచ్చాయి. ప్రభాస్‌ లుక్‌ సహజంగా లేదని, వేరే బాడీకి ప్రభాస్‌ హెడ్‌ని యాడ్‌ చేసినట్టు ఉందని, వీఎఫ్‌ ఎక్స్ సెట్‌ కాలేదని అన్నారు. మొత్తానికి దీనికి  మిశ్రమ స్పందన లభించింది. అయితే ఇందులో భారీ కాస్టింగ్‌ ఉండటంతో `మహానటి` వంటి క్లాసిక్‌ మూవీ అనంతరం నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాని గ్లోబల్‌ మూవీగా రూపొందిస్తున్నారు. అదే రేంజ్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లోగానీ, లేదంటే ద్వితీయార్థంలోగానీ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టింది చిత్ర యూనిట్‌. నిన్న అక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్‌ చెబుతూ, `కల్కి2898ఏడీ` నుంచి ఓ లుక్‌ని విడుదల చేశారు. సాయంత్రం సమయంలో దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్‌ లుక్‌ బ్లాక్‌ షేడ్‌లో ఉంది. దాంట్లో మరో ప్రపంచం కనిపిస్తుంది. భవిష్యత్‌ 2898ఏడాది సమయంలో మన ప్రపంచం ఎలా ఉండబోతుందనేది అందులో ఆవిష్కరించారు. భూమిపై వచ్చిన మార్పులు, అంతరిక్షంలోని మార్పులను చూపిస్తూ, రెండింటిని ప్రతిబింబించేలా ఈ ఫస్ట్ లుక్‌ ఉండటం విశేషం. ఫస్ట్ లుక్‌  టెస్ట్ టైమ్‌లో దీన్ని డిజైన్‌ చేశారట. ఎందుకో దాన్ని రిలీజ్‌ చేయలేదు.

అయితే ఆ మధ్య `కల్కి`లో ప్రభాస్‌ ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేయగా తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలా ట్రోల్స్ చేశారు. ప్రభాస్‌ లుక్‌ని ఇతర హాలీవుడ్‌ చిత్రాల్లోని సూపర్‌ హీరోల లుక్‌లతో పోల్చితూ ట్రోల్స్ చేశారు. దానితో పోల్చితే ఇదే కొత్తగా ఉందనే అభిప్రాయం వెల్లడి అవుతుండటం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios