Asianet News TeluguAsianet News Telugu

#Salaar వర్క్ షాప్స్ చేసాం అలాగే...ఇంటర్వూలో ప్రభాస్

ఇద్దరం కలిసి వర్క్‌షాప్స్‌ చేశాం. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సరదాగా షూటింగ్‌ జరిగింది. షూటింగ్‌ ఆరంభమైన నెలరోజుల్లోనే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం.

Prabhas about latest #SalaarCeaseFire movie jsp
Author
First Published Dec 16, 2023, 8:09 AM IST

సలార్‌’ పాన్‌ ఇండియా రికార్డులను తిరిగిరాయడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్‌’ది మొదటిస్థానం అని చెప్పాలి. టిక్కెట్ బుక్కింగ్స్ ఓపెన్ కాగానే ఓ రేంజిలో బుక్కింగ్స్ జరుగుతున్నాయి. ప్రభాస్‌, ప్రశాంత్‌నీల్‌ కలయికలో వస్తున్న ఈ పాన్‌ ఇండియా యాక్షన్‌ డ్రామా ఈ నెల 22న విడుదల కానుంది. రిలీజ్ కు కొద్ది రోజులే సమయం ఉండటమే టీమ్  ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలో ప్రభాస్ తో రాజమౌళి ఇంటర్వూ వీడియో వదులుతున్నారు. ఈ మేరకు ప్రభాస్ ఈ ఇంటర్వూలో చెప్పిన కొన్ని విషయాలు బయిటకువచ్చి వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ మాట్లాడుతూ...“సలార్‌’ చిత్రంలో యాక్షన్‌తో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ తరహా పాత్ర నేను ఇప్పటివరకు చేయలేదు. నా కెరీర్‌లో ఇదొక విభిన్నమైన చిత్రం. అలాగే ‘సలార్‌’ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. పాత్రల మధ్య చక్కటి భావోద్వేగాలు ఉంటాయి. నన్ను ఇప్పటివరకు చూడనటువంటి పాత్రలో చూస్తారు. ప్రశాంత్‌నీల్‌తో సినిమా అనుకున్నప్పుడు.. నా మైండ్‌లో ఉన్న ఆలోచనలను అతని ముందుంచాను. అందరికి రీచ్‌ అయ్యేలా సినిమా ఉండాలని చర్చించాం. నా ఐడియాస్‌లో కొన్ని ప్రశాంత్‌కు నచ్చాయి. ఇద్దరం కలిసి వర్క్‌షాప్స్‌ చేశాం. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సరదాగా షూటింగ్‌ జరిగింది. షూటింగ్‌ ఆరంభమైన నెలరోజుల్లోనే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం.
 
ఇక డైరక్టర్  ప్రశాంత్‌నీల్‌ హీరోలను గొప్పగా చూపించాలని తపిస్తాడు. ఈ సినిమాలో నా పాత్రను కూడా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఈ పాత్ర కోసం నేను ప్రత్యేకంగా కష్టపడలేదు. క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకు కాస్త కండలు పెంచాలని దర్శకుడు చెప్పారు. ఆయన కోరుకున్నట్లుగా ఫిట్‌గా తయారయ్యాను. ఈ సినిమాలో రెండు పాత్రల మధ్య చక్కటి సోదర భావం కనిపిస్తుంది. యాక్షన్‌ ఘట్టాలు అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తాయి అన్నారు. 
 
  సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. స‌లార్ మూవీలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న ఏ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అలాగే సలార్ ర‌న్‌టైం 2 గంట‌ల 55 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స‌లార్ ట్రైల‌ర్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావ‌డంతో మేక‌ర్స్ స‌లార్ నుంచి రెండో ట్రైల‌ర్ ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  

సలార్, వరద రాజ మన్నార్‌ స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.  హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్.. ‘సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్’ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రవిబస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేశారు.  ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ  హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. 

 

Follow Us:
Download App:
  • android
  • ios