పాన్‌ ఇండియాన స్టార్‌ డార్లింగ్‌ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రభాస్ 20 వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. సినిమా కాన్సెప్ట్‌ ను రివీల్ చేస్తున్న డిజైన్‌ చేసిన పోస్టర్‌లో ప్రభాస్‌ లుక్ వావ్‌ అనిపించేలా ఉంది. సినిమాకు చాలా రోజులు ప్రచారం అవుతున్నట్టుగా రాధే శ్యామ్‌ అనే  టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఫస్ట్ లుక్‌లో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న ప్రభాస్‌, పూజాల స్టిల్‌ను రివీల్ చేశారు.

ఈ సినిమాకు గోపిచంద్ హీరోగా జిల్‌ సినిమాను రూపొందించిన రాధా కృష్ణ కుమార్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌తో కలిసి ప్రభాస్‌ పెదనాన కృష్ణంరాజు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా ఇటలీలో చేశారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో హైదరాబాద్‌లోనే ఇటలీని తలపించేలా సెట్స్‌ నిర్మిస్తున్నారు. మిగతా భాగం షూటింగ్‌ను ఆ సెట్స్‌లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ జోతిష్కుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ క్యారెక్టర్‌ కోసం భారీ ఖర్చుతో వింటేజ్‌ కార్లను కలెక్ట్ చేసిన ఇటలీలో షూటింగ్ చేశారు.

బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియాన సినిమాల తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.