బాహుబలి సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. చిత్రంలో నటించిన రానా అనుష్క నుంచి సినిమాలు వచ్చాయి గాని ప్రధానమైన దర్శకుడు రాజమౌళి నుంచి ప్రభాస్ నుంచి మరొక ప్రాజెక్టు రాలేదు. రాజమౌళి సంగతి పక్కనపెడితే ప్రభాస్ కోసం అభిమానులుకొంచెం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.

బాహుబలి సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ చిత్రంలో నటించిన రానా అనుష్క నుంచి సినిమాలు వచ్చాయి గాని ప్రధానమైన దర్శకుడు రాజమౌళి నుంచి ప్రభాస్ నుంచి మరొక ప్రాజెక్టు రాలేదు. రాజమౌళి సంగతి పక్కనపెడితే ప్రభాస్ కోసం అభిమానులుకొంచెం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో యొక్క రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చెప్పడం కష్టమే. 

ఇకపోతే జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ఒకే చేసిన ప్రాజెక్టును వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే నటీనటులను ఫైనల్ చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనుంది. టెక్నీషియన్స్ ముందుగానే ఇటలీకి వెళ్లిపోగా రీసెంట్ గా ప్రభాస్ తో పాటు మిగిలిన నటీనటులు అక్కడి టీమ్ తో జాయిన్ అయ్యారట. 

పిరియడ్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ తో పూజ హెగ్డే నటించనుంది. ఒక రొమాంటిక్ కథగా దర్శకుడు కథను తెరకెక్కించనున్నాడు. ప్రధాన తారాగణం మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం అందుతోంది. మరి ప్రభాస్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.