ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో ఏం జరుగుతోందో అర్థం కానీ పరిస్థితి. చూస్తుంటే ప్రభాస్ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ కి గురైనట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్నీ తెలుపుతూ గగ్గోలు పెడుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి ఆ రేంజ్ మూవీ పడలేదు. ఆ మధ్యన వచ్చిన ఆదిపురుష్ మూవీ నిరాశపరిచింది. దీనితో ఫ్యాన్స్ ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఎడి చిత్రాలపై బోలెడు హోప్స్ తో ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన కల్కి 2898 ఎడి టీజర్ అదిరిపోయింది. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తిన టీజర్.. సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది. ఈ సంతోషంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి చిన్న ఝలక్ లాంటి సంఘటన. 

ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో ఏం జరుగుతోందో అర్థం కానీ పరిస్థితి. చూస్తుంటే ప్రభాస్ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ కి గురైనట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్నీ తెలుపుతూ గగ్గోలు పెడుతున్నారు. గత కొన్ని గంటలుగా ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. 

అడవుల్లో సైక్లింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన యువకుల దృశ్యాలు, రోడ్డు ప్రమాదాలు, ఫన్నీ మూమెంట్స్ ఇలా సంబంధం లేని పోస్ట్ లు గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఎఫ్ బి పేజీలో దర్శనం ఇస్తున్నాయి. మొదట అన్ లక్కీ హ్యుమన్స్ పేరుతో ఓ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోలో ఎడారిలో బైక్ రైడ్ చేస్తూ, అడవుల్లో సైక్లింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన యువకుల దృశ్యాలు ఉన్నాయి. 

రెండుగంటల వ్యవధిలో మరో వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోలో బాస్కెట్ బాల్, ఫుట్ బాల ఆడుతూ విఫలమైన దృశ్యాలు పోస్ట్ చేశారు. ఇలా అసలు ఏమాత్రం సంబంధం లేని వీడియోలు దర్శనం ఇస్తుండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రభాస్ అన్నా నీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయింది చూసుకోలేదా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ అన్నా నీ సోషల్ మీడియా టీం నిద్ర పోతోందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గంటలు గడుస్తున్నా ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

దీనితో ఫ్యాన్స్ రకరాలుగా ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ మొత్తం సలార్, కల్కి 2898 ఎడి చిత్రాలపైనే ఉంది. అలాగే మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రభాస్ ఓ ఫన్ ఎంటర్టైనర్ మూవీ కూడా చేస్తున్నారు.