జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది.

జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి 70 వేల పైగా భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించారు. 

జనసేన పార్టీ పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీనితో పవన్ అభిమానులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ హ్యాపీ మూమెంట్ జోష్ ని మరింత పెంచేలా ఓజి టీం కరెక్ట్ టైంలో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఓజి టైం బిగిన్స్ అంటూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా కూర్చుని ఉన్న పోస్టర్ వదిలారు. దీనితో అభిమానులు టైమింగ్ అంటే నిర్మాత దానయ్యదే అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

ఓజి చిత్రం సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కిస్తున్నారు.