కొడకా సాంగ్ తో పవన్ కల్యాణ్ పోలండ్ ఫ్యాన్ హంగామా.. వెనకున్నదెవరు?

power star pawan kalyan poland fan creating sensation with agnyathavaasi kodaka song
Highlights

  • యూ ట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లో నిలుస్తున్న అజ్ఞాతవాసి కొడకా సాంగ్
  • పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాటను తిరిగి పాడిన పోలెండ్ కుర్రాడు
  • పాటతో న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన కుర్రాడికి పవన్ థాంక్స్ తో రిప్లై

సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 'అజ్ఞాతవాసి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవన్ కల్యాణ్ కొడకా కోటేశ్వర్ రావు అనే పాట పాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న సాయంత్రం ఈ పాట విడుదలవ్వగా నాలుగు రోజుల్లోనే  8.4 మిలియన్ హిట్స్ వచ్చాయి.

 

ఈ పాటను యూకెలో ఉంటున్న పోలండ్ చంటిగాడైన బుజ్జిగాడు పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఈ ఎనిమిదేళ్ల జెబిగ్స్ బుజ్జి అనే కుర్రాడు పవన్ కల్యాణ్ ను అభిమానించడం, ముద్దు ముద్దుగా ఆ పాట పాడటం అందరినీ ఆకట్టుకుంది.

 

బుజ్జి పాటకు ఫిదా అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థాంక్స్ చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చారు. “డియర్ జెబిగ్స్ బుజ్జీ... మై డియర్ లిటిల్ ఫ్రెండ్, పాట రూపంలో నువ్విచ్చిన న్యూ ఇయర్ గిఫ్టుకు థాంక్స్. నువ్వు పంపిన సందేశం నాకు చేరింది. గాడ్ బ్లెస్ యూ'' అంటూ పవన్ కళ్యాణ్ తన మూవీస్ యాక్టివిటీని ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు.

 

స్వయంగా పవన్ కళ్యాణ్ నుండి రిప్లై రావడంతో బుజ్జిగాడు తెగ సంబరపడిపోతున్నాడు. తాను క్లౌడ్ 9లో తేలియాడుతున్నానని ట్వీట్ చేశాడు. అంతే కాదు.. జనవరి 9న పవన్ కళ్యాణ్ ఆంథెమ్ విడుదల చేస్తానని, దీన్ని తానే స్వయంగా కంపోజ్ చేసి పాడుతానని పోలండ్ కుర్రాడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

 

ఈ పోలండ్ బుజ్జిగాడు పాడిన కొడకా పాటకు మంచి స్పంద వస్తోంది. దాదాపు 60 వేల మంది చూశారు. దాదాపు 10 వేలకు పైగా లైక్స్, రీట్వీట్స్ వచ్చాయి. దీంతో పాటు వందల్లో అప్రిషియేషన్ కామెంట్స్ వచ్చాయి.

 

ఇటీవల హైదరాబాద్ లో తెలుగు మహా సభలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఈ పోలండ్ కుర్రాడు ట్వీట్లు చేశాడు. తెలుగు చాలా గొప్ప భాష అంటూ ప్రశంసలు గుప్పించాడు. మాతృ భాషే సరిగా తెలియని 8ఏళ్ల వయసులో ఉన్న కుర్రాడికి తెలుగు బాష గురించి తెలిసే అవకాశమే లేదని, ఎవరో తెలుగు వారు ట్విట్టర్లో సెన్షేషన్ కోసమే ఇదంతా అతడితో చేయిస్తున్నారని స్పష్టం అవుతోంది.

 

అక్కినేని యువ హీరో అఖల్ నటించిన ‘హలో' మూవీలో పాటన కూడా ఈ పోలెండ్ బుజ్జిగాడు పాడాడు. దీన్ని బట్టి ఈ పోలండ్ కుర్రాడి వెనక ఎవరో తెలుగు సినిమా అభిమాని, తెలుగు భాషాభిమాని ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 

అంతే కాదు.. తెలుగు మహా సభలు జరిగిన సమయంలో దర్శకుడు రాజమౌళి, చంద్రబాబు, కేటీఆర్ ప్రస్తావన తెస్తూ ట్వీట్ చేశాడు. ఈ వివరాలన్నీ పరిశీలిస్తే పోలండ్ కుర్రాడి వెనక ఎవరో తెలుగు వ్యక్తి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

 

loader