పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందడి షురూ అయ్యింది. సెప్టెంబర్‌ 2న ఆయన పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. దీంతో పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌ ట్రీట్స్ రూపంలో వస్తాయని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే భారీ ట్రీట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్‌. 

ప్రధానంగా ఆయన నటిస్తున్న `వకీల్‌ సాబ్‌`కి సంబంధించి టీజర్‌ వస్తుందని ఆశిస్తున్నారు. అంతేకాదు పవన్‌ నటించబోయే 29వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్‌ కూడా వస్తుందనే ప్రచారం జరుగుతుంది. వీటికి సంబంధించిన హింట్‌ ఇప్పటికే ఇచ్చారు. పవన్‌ 29వ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇప్పటికైతే పవన్‌ బర్త్ డేని పురస్కరించుకుని ఈ రెండు ట్రీట్‌ వస్తాయనేది దాదాపుగా కన్ఫమ్‌ అయ్యింది. 

తాజాగా మరో కొత్త కబురు చెప్పారు మైత్రీ మూవీ మేకర్. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ 28వ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రీట్‌ని సెప్టెంబర్‌ 2న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఇవ్వనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రకటనతో పవన్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఒకే రోజు మూడు ట్రీట్‌లతో కనువిందుగా ఉంటుందని సంబరపడుతున్నారు. ఇప్పటికే బర్త్‌ డే యాష్‌ ట్యాగ్‌తో వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసిన అభిమానులు మరి పవన్‌ కోసం ఆయన బర్త్ డేకి ఇంకా ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి.