అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే.. ఇప్పటి వరకూ ఏ హీరోకు సాధ్యం కాని అరుదైన రికార్డ్ ఆయన ఖాతాలో పడింది. అది కూడా సోసల్ మీడియాకు సబంధించి సరికొత్త చరిత్ర రాశారు పవర్ స్టార్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఒక రకంగా చూస్తే.. మెగా హీరోలలో చిరంజీవిని మంచి ఫాలోయింగ్ సంపాదించాడే పవర్ స్టార్. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ ఊపిరి మెసలనివ్వరు. పవర్ స్టార్ అంటే ప్రాణాలు ఇచ్చేవారు కోకోల్లలు, ఆయన ఏదైనా కొత్త పని చేస్తున్నాడంటే..సపోర్ట్ గా నిలవడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు ఫ్యాన్స్. ఇక ఆయన తనంటే ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఒక్కటంటే ఒక్క పోస్ట్ లేకుండా.. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే భారీ ఫాలోవర్స్ ను సాధించి సరికొత్త రికార్డ్ సాధించాడు పవన్ కళ్యాన్.
తాజాగా పవర్ స్టార్.. పవన్ కళ్యాన్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అటు పొలిటికల్ గా.. ఇటు సినిమాల పరంగా ఫ్యాన్స్ కుదగ్గరగాఉండటం కోసం ఆయన ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు. అయితే అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో.. అప్పటి నుంచి ఫాలోవర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డారు. తమ అభిమాన తారను ఫాలో అవ్వాలని విపరీతంగా బటన్స్ నొక్కేశారు. ఫలితంగా పవర్ స్టార్ ఒక్కటంటే ఒక్క పోస్ట్ పెట్టకుండానే దాదాపుగా 2 మిలియన్ ఫాలోవర్స్ పైనే అనగా దాదాపు 20 లక్షలకు పైగా ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇలా ఆల్ టైమ్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
తమ అభిమాను హీరోను.. చూసేందుకో.. టచ్ చేసేందుకో ప్రయత్నిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా.. వారిచ్చే అప్టేట్స్ తెలుసుకునేందుకు ఆరాటపడుతూనే ఉంటారు. వారిని ఫాలో అవుతూనే ఉంటారు. ఇక తజాగా ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చిన పవన్ విషంయలోనూ అదే చేశారు. ఇంకా ఒక్క పోస్ట్ కూడా చేయనే లేదు.. అప్పుడే కుప్పలు తెప్పలుగా… రికార్డ్ లెవల్ ఫాలోవర్స్ వచ్చి చేరిపోయారు. సినిమాల్లో ఉన్నప్పుడు.. అంతగా సోషల్‌గా మూవ్ కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … రాజకీయాలకు వచ్చాక మాత్రం..అటు జనల్లోనూ.. ఇటు సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యారు.
