పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ హిట్ మూవీ పింక్‌ను  తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు పవన్‌. ఆ మూవీలో పవన్‌ బందిపోటు దొంగ పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

తనకు గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ సినిమాను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్‌ స్టార్‌. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలు లైన్‌లో ఉండగానే మరో క్రేజీ మూవీకి సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. త్వరలో ఓ మలయాళ సూపర్‌ హిట్ సినిమా రీమేక్‌ లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
Driving Licence Review | Driving Licence Malayalam Movie Review by ...

2019లో రిలీజ్ అయిన మలయాళ సూపర్‌ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్‌. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్‌గానూ మంచి విజయం సాధించింది. మలయాళంలో లాల్‌ జూనియర్‌ డైరెక్టర్ చేసిన ఈ సినిమాలో పృథ్వీ రాజ్ హీరోగా నటించాడు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ లో పవన్‌ కళ్యాణ్ హీరోగా నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్న ఓ బడా నిర్మాత పవన్‌ ను ఒకసారి సినిమా చూడాల్సిందిగా కోరాడట. మరి పవన్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ రీమేక్‌కు ఓకె చెప్తాడా..? లేదా చూడాలి.