పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఎలా ఉంటుందో మరోసారి రుజువయ్యింది. రిజల్ట్ సంగతి పక్కనపెడితే పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసిన రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని తేలిపోయింది. గత ఏడాది సంక్రాంతికి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 

రిలీజయిన మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఆ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ అందుకుంది. కానీ సినిమా యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.  సాధారణంగా మన తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే నార్త్ జనాలు ఎగబడి చూస్తుంటారు. ఇక పవర్ స్టార్ సినిమాలకు ముందు నుంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు అజ్ఞాతవాసి 100 మిళియన్ల వ్యూవ్స్ ని అందుకొని పవర్ స్టార్ కెరీర్ లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరక్కేక్కిన ఆ సినిమాను హిందీలో ఎవడు 3 టైటిల్ తో రిలీజ్ చేశారు. కీర్తి సురేష్ - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు. హారిక హాసిని ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాను గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థ హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది.