ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత ఈ మధ్యన రాజకీయాల్లో బిజీగా ఉన్న పోసాని కృష్ణ మురళి హైదరాబాద్ యశోదా హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. తన మోకాలు విపరీతమైన నెప్పిగా ఉండటంతో ఆపరేషన్ చేయించుకోబోతున్నారు.

మరో ప్రక్క పోసాని కృష్ణ మురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు దేశమం  నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం.. పోసానికి నోటీసులు పంపింది.

ఎన్నికల సంఘం నోటీసులపై పోసాని కృష్ణమురళి స్పందించారు. ఎన్నికల సంఘానికి ఆయన లెటర్  రాశారు. సీఎంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, ఆపరేషన్‌ కోసం యశోదా ఆస్పత్రిలో చేరానని తెలిపారు. అలాగే మెడికల్ రిపోర్ట్స్ సైతం ఆ లెటర్ క కలిపారు.