జూనియర్ ఎన్టీఆర్ అయినా, జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒక్కటే.. నోరు జారిన పోసాని, ఫ్యాన్స్ లో దుమారం
సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏ అంశం గురించి అయినా వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన శైలే వేరు. అయితే అలా మాట్లాడి పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు.

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏ అంశం గురించి అయినా వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన శైలే వేరు. అయితే అలా మాట్లాడి పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. చాలా కాలం నుంచి పోసాని వైసీపీ, వైఎస్ జగన్ మద్దతు దారుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
సీఎం జగన్.. పోసానిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. తాజగా పోసాని ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ కాస్త నోరు జారారు. పోసాని చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
పోసాని ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడకపోయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం తారక్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాన్నాము అని పోసాని అన్నారు. ఈ విషయంపై సీఎం జగన్ తో మాట్లాడాను.
ఇండస్ట్రీ అందరికీ. ఎంబీఏ లాంటి పై చదువులు చదువుకున్న వారు కూడా జూనియర్ ఆర్టిస్టులుగా ఉన్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అయినా, జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒక్కటే. అందరూ ఆర్టిస్టులే.. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా ఉండకూడదు అని పోసాని తెలిపారు.
పెద్ద హీరోయిన్ అయినా, చిన్న హీరోయిన్ అయినా కూడా ఒక్కటే. ఏపీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వారందరిని గుర్తించి ఐడెంటిటీ కార్డులు ఇస్తాం అని పోసాని తెలిపారు. ఈ విధంగా తారక్ ని పోసాని జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. పోసాని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.