హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ క్లబ్‌లో సిద్‌ శ్రీరామ్‌ ని కొందరు ఆకతాయిలు అవమానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఇటీవల ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌ నిర్వహించారని, అందులో మద్యం మత్తులో కొందరు దుండగులు సింగర్‌పై వాటర్‌ బాటిళ్లు, మద్యం విసిరేశారట. 

సిద్‌ శ్రీరామ్‌ ప్రస్తుతం పాపులర్‌, క్రేజీ సింగర్‌. ఆయన పాడేప్రతి పాట సూపర్‌హిట్‌. అదొక సెన్సేషన్‌ అవుతుంది. ఆయన గాత్రమే ఆయన బలం. వరుసగా హిట్‌ సింగ్స్ తో దూసుకుపోతున్న సిద్‌ శ్రీరామ్‌కి అవమానం జరిగిందట. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఆయన్ని కొందరు ఆకతాయిలు అవమానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఇటీవల ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌ నిర్వహించారని, అందులో మద్యం మత్తులో కొందరు దుండగులు సింగర్‌పై వాటర్‌ బాటిళ్లు, మద్యం విసిరేశారట. 

దీంతో ఆగ్రహించిన సిద్‌ శ్రీరాం వారిపై ఫైర్‌ అయ్యారట. స్థానిక సెక్యూరిటీ చేత బయటకు పంపించినట్టు తెలుస్తుంది. అయితే ఈ గొడవ జరిగినప్పుడు ఆ ఈవెంట్‌లో కొందరు సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారంట. దీంతో ఈ గొడవ విషయం బయటకు రాకుండా వాళ్లు జాగ్రత్త పడ్డట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో సిద్‌ శ్రీరామ్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. `క్రమశిక్షణ ఉంటే ఎవరికీ బయటపడాల్సిన అవసరం లేద`న్నారు. డిసిప్లెయిన్‌ ముఖ్యమన్నారు. ఆ పబ్‌లో తనపై అనుచితంగా ప్రవర్తించి, అవమాన పరిచిన వారిని ఉద్దేశించి సిద్‌ శ్రీరామ్‌ ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తుంది. 

Scroll to load tweet…

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అద్బుతమైన పాటలతో దూసుకుపోతున్న సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలు ఇటీవల బాగా వైరల్ అయ్యాయి. అందులో `వకీల్‌సాబ్‌`లోని `మగువ.. మగువ.. `, `30రోజుల్లో ప్రేమించడం ఎలా`లోని `నీలి నీలి ఆకాశం..`, `శశి` చిత్రంలోని `ఒకే ఒక లోకం.. `, వంటి పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పదికిపై చిత్రాలకు ఆయన పాటలు పాడుతూ ఫుల్‌ బిజీగా ఉన్నారు.