పాపులర్‌ కొరియన్‌ పాప్‌ సింగర్‌ కన్నుమూసింది. కొరియాకి చెందిన సింగర్‌ హెసూ(29) హోటల్‌లో ఆత్మహత్యకి పాల్పడింది. దీంతో కొరియన్‌ చిత్ర పరిశ్రమ, సంగీత రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాపులర్‌ కొరియన్‌ పాప్‌ సింగర్‌ కన్నుమూసింది. కొరియాకి చెందిన సింగర్‌ హెసూ(29) హోటల్‌లో ఆత్మహత్యకి పాల్పడింది. దీంతో సినీ రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హేసూ సోమవారం ఆత్మహత్యకి పాల్పడినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు,స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హెసూ హోటల్‌లో ఆత్మహత్యకి పాల్పడగా, ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ని గుర్తించారు సౌత్‌ కొరియన్‌ పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. 

 తనదైన అద్భుత పాటలతో హెసూ ఇండియన్‌ శ్రోతలను కూడా అలరిస్తుంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. అయితే చాలా చిన్న వయసులోనే హెసూ ఆత్మహత్యకి పాల్పడి కన్నుమూయడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 1993లో జన్మించిన హేసూ `మై లైఫ్‌`, `మీ` ఆల్బమ్స్ తో కెరీర్‌ని ప్రారంభించింది. `గయా స్టేజ్‌`, `హ్యాంగౌట్‌ విత్ యూ`, `ది ట్రోల్‌ షో` లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సింగర్‌ హేసూ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంతాపం తెలియజేస్తున్నారు. 

ఇదిలా ఉంటే పాప్‌ సింగర్‌ హేసూ ఈ నెల 20న జియోల్లాబుక్‌-డో లోని వంజు గన్‌లో గ్వాన్‌ జుమియోస్‌ పీపుల్స్ డే కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. తాజా పరిణామాలతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇదిలా ఉంటే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అందుకు కారణాలేంటనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)