ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్‌ రాథోడ్‌(66) కన్నుమూశారు. సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ కరోనాతో పోరాడి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్‌ రాథోడ్‌ వెల్లడించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్‌ రాథోడ్‌(66) కన్నుమూశారు. సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ కరోనాతో పోరాడి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్‌ రాథోడ్‌ వెల్లడించారు. `రాత్రి 10.15 నిమిషాలకు నాన్న చనిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించండి` అని తెలిపారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే సోమవారం ఆరోగ్యం పరిస్థితి సీరియస్‌గా మారడంతో ముంబయిలోని ఎస్‌ఎల్‌ రహేజా హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. దాదాపు నాలుగు రోజులపాటు కరోనాతో పోరాడి గురువారం నైట్‌ కన్నుమూశారు. 

నదీమ్‌తో కలిసి శ్రావణ్‌ బాలీవుడ్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు సంగీతం అందించారు. ఐకానిక్‌ కంపోజర్స్ గా పేరు తెచ్చుకున్నారు. మ్యూజిక్‌ బ్లాక్‌బస్టర్స్ `ఆషిఖీ`, `సాజన్‌`, `హమ్‌ హై రహీ ప్యార్‌ కే`, `పర్దేశ్‌`, `రాజా హిందుస్థానీ`, `రాజా`, `బర్సాత్‌`, `అగ్నీ శక్తి`, `జీత్‌`, `రాజ్‌`, `కసూర్‌`, `ధాడ్కన్‌`, `దిల్‌ హై తుమ్హారా`, `దిల్‌ కా రిస్టా`, `అందాజ్‌`, `బేవాఫా` వంటి సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన వాటి విజయాల్లో భాగమయ్యారు. వీరి సంగీతంలో లతా మంగేష్కర్‌, ఆశా బోంస్లే, సోనూ నిగమ్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిత్ర, ఉదిత్‌ నారాయణ్‌, శంకర్‌ మహదేవన్‌ వంటి దాదాపు అందరు సింగర్స్ పాటలు పాడటం విశేషం.

నదీమ్‌ షఫీ- శ్రావణ్‌ రాథోడ్‌ కలిసి మ్యూజిక్‌ డైరెక్టర్స్ గానే కాకుండా మ్యూజిక్‌ ప్రొడ్యూసర్స్ గా, కంపోజర్స్ గా, సింగర్స్ గా, ఇన్‌స్ట్రూమెంటలిస్ట్ గా పనిచేశారు. వీరిద్దరు 2005లో విడిపోయారు. నదీమ్‌ సొంతంగా కంపెనీ పెట్టుకోగా, శ్రావణ్‌ తన కుమారుడు రాజీవ్‌, దర్శన్‌ సంగీత కెరీర్‌పై దృష్టిపెట్టారు. కానీ ఆ తర్వాత 2009లో మళ్లీ కలిసి పనిచేయడం ప్రారంభించారు. మధ్య మధ్యలో విడిపోవాడం, తర్వాత కలవడం చేశారు. ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 

బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న సంగీత ద్వయం `నదీమ్‌-శ్రావణ్‌`లోని శ్రావణ్‌ మరణంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. కరోనా వల్ల ఎప్పుడు ఎలాంటి చేదు వార్తలను వినాల్సి వస్తుందో ఊహించలేకపోతున్నామని, శ్రావణ్‌ మరణం బాలీవుడ్‌కి తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ సంతాపాన్ని తెలియజేశారు. `శ్రావణ్‌ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నా. చాలా బాధగా ఉంది. ఆయనతో నాకు చాలా మంది అనుబంధం ఉంది. `జుడాయి అండ్‌ సిర్ఫ్ తుమ్‌` చిత్రాలకు సంగీతం అందించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. శ్రేయా ఘోషల్‌, అద్నాన్‌ షమీ, జీత్‌ గంగూలి, ప్రీతమ్‌ వంటి వారు సంతాపం తెలిపారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…