ప్రముఖ హాస్య నటుడు మనోబాల(69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ హాస్య నటుడు మనోబాల(69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కమెడియన్‌గా మనోబాల తమిళంలోనే కాదు, దక్షిణాది భాషలకు సుపరిచితమే. తనదైన కామెడీతో ఆయన నవ్వులు పూయించారు. అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 

తమిళంలో దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణించిన మనోబాల.. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఈ బుధవారం ఉదయం కన్నమూశారు. మనోబాల మరణ వార్తతో చిత్ర పరిశ్రమతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా కోలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. మనోబాల ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. వారి పక్కన కమెడియన్‌గా చేసి మెప్పించింది. కేవలం హాస్య నటుడిగానే కాదు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ మెప్పించారు. కానీ తన మార్క్ కామెడీని వదల్లేదు. 

1953, డిసెంబర్ 8న తమిళనాడులోని నగరకోవిల్ సమీపంలో మరుంగూర్‌లో జన్మించిన మనోబాల.. అసలు పేరు బాలచందర్‌. ఆ తర్వాత మనోబాలగా పేరు మార్చుకున్నారు. ప్రారంభంలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ప్రధానంగా భారతీరాజా వద్ద ఎక్కువగా పనిచేశారు. లోకనాయకుడు కమల్‌ సినిమాలకు ఆయన వర్క్ చేయడం. అటు భారతీరాజా, కమల్‌లతో మనోబాలకి మంచి అనుబంధం ఉంది. 1979లో భారతీరాజా రూపొందించిన `పుతియ వారప్పుగల్‌` చిత్రంతో నటుడిగానూ మారారు. ఇందులో భాగ్యరాజ్‌ హీరోగా నటించారు.

తమిళంలో వందల్లో సినిమాలు చేసిన మనోబాల కొన్ని తెలుగు సినిమాల్లోనూ మెరిశారు. రజనీకాంత్‌ నటించిన బైలింగ్వల్‌ `కథానాయకుడు`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకు ముందే రజనీ, కమల్‌, విక్రమ్‌, విజయ, సూర్య వంటి హీరోల సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. వీరి సినిమాలు తెలుగులోనూ డబ్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత `పున్నమి నాగు`, నాగార్జున `ప్రయాణం`, `మనసును మాయ సేయకే`, `డేగ`, `ఊపిరి`, `రాజాది రాజా`, `నాయకి, `మహానటి`, `దేవదాస్‌`, `రాజ్‌ దూత్‌` చిత్రాల్లో నటించారు. ఇటీవల చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`లోనూ మెరిశారు మనోబాల. 

నటుడిగా సినిమాలతోపాటు పలు సీరియల్స్ లోనూ మెరిశారు. మరోవైపు 24కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో చాలా సినిమాలో మంచి విజయాలు సాధించాయి. ఇందులో `మేరా పతి సర్ఫ్‌ మేరా హై` అనే హిందీ చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించడం విశేషం. సీనియర్‌కి కూడా దర్శకత్వం వహించారు. నిర్మాత `సథురంగ వెట్టై`, `పాంభు సెట్టై`, `సథురంగ వెట్టై2` చిత్రాలను నిర్మించారు.