ప్రముఖ బాలీవుడ్ నటుడు, రైటర్ శివ సుబ్రమణ్యం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన సోమవారం ఉదయం మరణించినట్టు తెలుస్తుంది.
ప్రముఖ నటుడు,స్క్రీన్‌ప్లే రైటర్ శివ సుబ్రమణ్యం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ మేకర్ హన్సన్ మెహతా ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతాపం తెలియజేశారు. పాపులర్ బాలీవుడ్ చిత్రం `పరిందా` తో ఆయన నటుడిగా జీవితం ప్రారంభమైంది. నటుడిగానే కాదు, స్క్రీన్ రైటర్‌గానూ విశేష గుర్తింపు తెచ్చుకున్నారు శివ సుబ్రమణ్యం.
సీరియల్ `ముఖ్తీ బంధన్`, `మీనాక్షి సుందరేశ్వర్` సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక టీవీ షోలు చేశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమ తీరని లోటని వెల్లడిస్తున్నారు. శివ సుబ్రమణ్యం స్క్రీన్‌ప్లే అందించిన `హజరాన్ ఖ్వాహిషీన్ ఆహిషి` అనే సినిమా ఫిల్మ్‌ఫేర్‌తోపాటు అనేక అవార్డులను అందుకుంది. ఇందులో ఆయన నటించడం విశేషం.
రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివ సుబ్రమణ్యం. `తీన్ పట్టి`, `కామెల్`, `డెడ్ ఎండ్`, `అర్జున్ పండిట్`, `ఈజ్ రాత్ కి సుభా నహీ` వంటి సినిమాలకు రైటర్‌గా చేశారు. మరోవైపు నటుడిగా `తు హై మేరా సండే`, `మీనాక్షి సుందరేశ్వర్`, `నైల్ పాలిష్`, `హిచ్కీ`, `లఖాన్ మెయిన్ ఏక్`, `స్టాన్లీ కా దబ్బా`, `పరిందా` `1942ః ఏ లవ్ స్టోరీ`, `కమినే`, `తీన్ పట్టి` వంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.
