Asianet News TeluguAsianet News Telugu

విషాదంః గుండెపోటుతో ప్రముఖ నటుడు అమిత్‌ మిస్త్రీ కన్నుమూత..

ప్రముఖ హిందీ, గుజరాతీ నటుడు అమిత్‌ మిస్త్రీ(47) కన్నుమూశారు. చాలా ఫిట్‌గా, హెల్దీగా ఉన్న అమిత్‌ శుక్రవారం ఉదయం 9.30గంటలకు అంథేరీలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించడం విషాదకరం. 

populer actor amit mistry dies with cardiac arrest  arj
Author
Hyderabad, First Published Apr 24, 2021, 8:08 AM IST

ప్రముఖ హిందీ, గుజరాతీ నటుడు అమిత్‌ మిస్త్రీ(47) కన్నుమూశారు. చాలా ఫిట్‌గా, హెల్దీగా ఉన్న అమిత్‌ శుక్రవారం ఉదయం 9.30గంటలకు అంథేరీలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించడం విషాదకరం. ఈ విషయాన్ని ఆయన మేనేజర్‌ వెల్లడించారు. `అమిత్‌ మార్నింగ్‌ లేచి వ్యాయామం పూర్తి చేసుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశాడు. అంతలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. అమిత్‌ చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేవాడు. ఎలాంటి అనారోగ్యంగానీ, ఒత్తిడి గానీ లేదు. కానీ ఒక్కసారిగా ఇలా జరగడం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది` అని మేనేజర్ మహర్షి దేశాయ్‌ వెల్లడించారు.

అమిత్‌ ఇటీవల `బందీష్‌ బండిట్స్` వెబస్‌ సిరీస్‌తో బాగా పాపులర్‌ అయ్యారు. ఇందులో మ్యూజీషియన్‌ దేవేంద్ర రాథోడ్‌గా అలరించారు. దీంతోపాటు `షోర్‌ ఇన్ ది సిటీ`, `బే యార్‌`, `క్యా కెహ్నా`, `ఏక్‌ ఛాలిస్‌ కి లాస్‌ లోకల్‌`, `99`, `ఏ జెంటిల్‌మ్యాన్‌` చిత్రాలతో బాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గుజరాతీ థియేటర్‌ ఆర్టిస్టుగా ఆయనకు మంచి పేరుంది. సినిమాలతోపాటు `ఏ దునియా హై రంగీన్‌` అనే పాపులర్‌ టీవీ సిరీస్‌లోనూ నటించారు అమిత్‌. ప్రస్తుతం ఆయన సైఫ్‌ అలీ ఖాన్‌, అర్జున్‌ కపూర్‌ కలిసి నటిస్తున్న `భూట్‌ పోలీస్‌` చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు.

అమిత్‌ మిస్త్రీ హఠాన్మరణంతో బాలీవుడ్‌ సినీ, టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతికి గురవుతున్నారు. `అమిత్‌ మరణ వార్తని జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఎక్కడున్న ప్రేమని పంచుతారు. మా ప్రేమ ఎప్పుడూ మీకు ఉంటుంది` అని `బందీష్‌ బండిట్‌`సహ నటుడు రాజేష్‌ తైలాంగ్‌ సంతాపం తెలిపారు. సింగర్‌, నటుడు స్వనంద్‌ కిర్కిరే స్పందిస్తూ, `అమిత్‌ మిస్త్రీ లేదన్న వార్త నమ్మలేకపోతున్నా. ఆయన అద్భుతమైననటుడు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి` అని తెలిపారు. మరో నటుడు టిస్కా చోప్రా చెబుతూ, `ఆయన మంచి వ్యక్తి. ఎప్పడూ చిల్‌గా ఉంటారు. ఆయన ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios